HOME »NEWS »MOVIE »koratala siva objection about allu arjun suggestions ta

అల్లు అర్జున్‌కు కొరటాల శివ వార్నింగ్.. ఇకపై అలాంటివి కుదరవంటున్న దర్శకుడు..

అల్లు అర్జున్‌కు కొరటాల శివ వార్నింగ్.. ఇకపై అలాంటివి కుదరవంటున్న దర్శకుడు..
అల్లు అర్జున్, కొరటాల శివ (File/Photo)

అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా సెట్స్ పై ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు ప్రకటించాడు. తాజాగా ఈ సినిమా విషయంలో బన్ని చెప్పిన ఓ విషయాన్ని కొరటాల శివ నో చెప్పినట్టు సమాచారం.

  • Share this:
    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ‌ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు.ఈ  సినిమా తర్వాత అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే విడులైన ఆ చిత్రం ఫస్ట్ లుక్‌, టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌ రఫ్ అండ్ రస్టిక్‌గా ఉండి అదిరిపోయింది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కానుంది.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్.. కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్టు ప్రకటించాడు.

    కొరటాల శివ, అల్లు అర్జున్ సినిమా ఫస్ట్ లుక్ (Twitter/Photo)




    ఐతే.. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాను కూడా అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో పాటు వాళ్ల నాన్న అల్లు అరవింద్.. దర్శకుడు కొరటాల శివకు ఓ సూచన చేశారట. ఈ సినిమాను ‘సాహో’ లాగే పూర్తిగా హిందీ చిత్రంలా తెరకెక్కించమని సలహా ఇచ్చారట. దానికీ కొరటాల శివ ఇది.. పూర్తిగా మన దక్షిణాది సంస్కృతి, సాంప్రదాయాల ఆధారంగా తెరకెక్కుతోంది. కాబట్టి ఈ సినిమాను మీరు చెప్పినట్టు హిందీ నేటివిటీతో తెరకెక్కించడం కుదరదని కుండ బద్దలు కొట్టేశాడట. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించి కథ, కథనాలు పూర్తిగా తనకే ఒదిలేయాలని ఏదైనా నేనే చూసుకుంటానని అల్లు అర్జున్‌తో పాటు అరవింద్‌కు కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడట. అంతేకాదు స్క్రిప్ట్ విషయంలో ఎవరైనా వేలు పెడితే.. ఈ ప్రాజెక్ట్ చేయనని ఖరాఖండీగా చెప్పినట్టు సమాచారం.  దీంతో వాళ్లు చేసేది లేక కొరటాల శివ నిర్ణయానికి తలూపినట్టు సమాచారం. ఈ సినిమాను ప్రస్తుతం సమాజంలో జరగుతోన్న ఓ ఇష్యూపై కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా ‘ఆచార్య’ తర్వాత బన్నితో కొరటాల శివ చేయబోయే ఈ సినిమాపై అభిమానుల్లో అపుడే అంచనాలు మొదలయ్యాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:August 26, 2020, 07:57 IST