KORATALA SIVA INTERESTING TWEET OVER ACHARYA MOVIE AND RAM CHARAN SIDDHA CHARACTER PK
Ram Charan Acharya: ఆచార్య ‘సిద్ధ’మవుతున్నాడు.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ ట్వీట్..
ఆచార్యలో రామ్ చరణ్ (Ram Charan in Acharya)
Ram Charan Acharya: ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సైరా తర్వాత మెగాస్టార్ నుంచి మరో సినిమా రాలేదు. అందుకే ఆశలన్నీ ఇప్పుడు ఆచార్యపైనే ఉన్నాయి.
ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సైరా తర్వాత మెగాస్టార్ నుంచి మరో సినిమా రాలేదు. అందుకే ఆశలన్నీ ఇప్పుడు ఆచార్యపైనే ఉన్నాయి. పైగా దీనికి కొరటాల శివ దర్శకుడు కావడం.. అన్నింటికంటే ముఖ్యంగా తండ్రీ కొడుకులు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. విడులదకు మూడు నాలుగు నెలల ముందుగానే ఆచార్య బిజినెస్ అంతా అయిపోతుంది. నైజాంలో ఏకంగా 42 కోట్లకు వరంగల్ శ్రీను ఆచార్య రైట్స్ సొంతం చేసుకున్నాడు. అలా చాలా ఏరియాల్లో ఇప్పటికే సినిమాను అమ్మేసారు కూడా. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుపల్లి అడవుల్లో జరుగుతుంది. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నాడు. చిరు, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు కొరటాల. ఇప్పటికే విడుదలైన చరణ్ ప్రీ లుక్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆచార్య ‘సిద్ధ’మవుతున్నాడు అంటూ మరోసారి కొరటాల అందరిలోనూ ఆసక్తి పుటించాడు. రామ్ చరణ్ ప్రీ లుక్‌తో పాటు అతడి భుజంపై చిరంజీవి చేయిని.. ముందు తుపాకిని చూపించి కథపై ఆసక్తి రేపాడు. ఇందులో రామ్ చరణ్ నక్సలైట్‌గా నటిస్తున్నాడని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు బయటికి వచ్చిన ఫోటో చూసిన తర్వాత ఆయన నక్సలైట్ అనేది ఖరారు అయిపోయింది. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. మార్చిలోనే షూటింగ్ పూర్తి చేసి.. ఎప్రిల్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ చేయాలని చూస్తున్నాడు కొరటాల శివ.
మే 13న విడుదల కానుంది ఆచార్య. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. మణిశర్మ చాలా ఏళ్ళ తర్వాత చిరు సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆచార్య తర్వాత మరో మూడు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు చిరంజీవి. లూసీఫర్, వేదాళం రీమేక్‌లతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు మెగాస్టార్.