Acharya Controversy: కొరటాల కోపం.. కోర్టులోనే తేల్చుకుందాం..

Acharya Controversy: ఆచార్య సినిమాపై వివాదం రాజుకుంటుంది. ఈ కథ నాదే అంటూ రాజేష్ మండూరి అనే రైటర్ మీడియాకు ఎక్కి నానా యాగీ చేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 29, 2020, 6:15 PM IST
Acharya Controversy: కొరటాల కోపం.. కోర్టులోనే తేల్చుకుందాం..
కొరటాల శివ ఆచార్య (koratala siva acharya)
  • Share this:
ఆచార్య సినిమాపై వివాదం రాజుకుంటుంది. ఈ కథ నాదే అంటూ రాజేష్ మండూరి అనే రైటర్ మీడియాకు ఎక్కి నానా యాగీ చేస్తున్నాడు. ఈ విషయం అటు తిరిగి ఇటు తిరిగి కొరటాల వరకు కూడా వెళ్లింది. దాంతో ఆయన కూడా సీరియస్ అయ్యాడు. ముందు రాజేష్‌కు ఎన్నో రకాలుగా చెప్పి చూసాడు కొరటాల శివ. ఆచార్య కథ దేవాదాయ శాఖ చుట్టూ తిరగడం.. తండ్రీ కొడుకులు.. తండ్రిని చంపేస్తే కొడుకు పగ తీర్చుకోవడం లాంటిది కాదని.. తన కథ పూర్తిగా వేరు అంటున్నాడు కొరటాల.
ఆచార్యగా చిరంజీవి (Twitter/Photo)
ఆచార్యగా చిరంజీవి (Twitter/Photo)


కానీ రాజేష్ మాత్రం అలా కాదు.. నా కథే మీరు తీస్తున్నారు అంటూ కొరటాలతో వితండ వాదం చేస్తున్నాడు. నా ప్రాణం పెట్టి రాసాను.. ఈ కథను మైత్రి మూవీ మేకర్స్‌కు చెప్తే అది మీ వరకు తీసుకొచ్చారు అంటూ ఆరోపించాడు కూడా. దాంతో దర్శకుడు కొరటాల శివకు కూడా కోపం వచ్చేసింది. ఎప్పుడూ శాంతంగా కనిపించే ఈయన.. కథ కాపీ చేసాడని ఆరోపణలు మాత్రం తట్టుకోలేకపోయాడు.
కొరటాల శివ (koratala siva)
కొరటాల శివ (koratala siva)

ఈ కథను రెండేళ్లుగా చిరంజీవితో కూర్చుని రాస్తున్నానని.. ఆయన ఇమేజ్‌కు సరిపోయేలా వచ్చిందని.. ఇప్పుడు ఎవరో వచ్చి తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనంటున్నాడు కొరటాల. ఎన్నో రకాలుగా చెప్పినా కూడా రాజేష్ మండూరి అర్థం చేసుకోవడం లేదని.. అందుకే తానే ఇప్పుడు కోర్టుకు వెళ్తానంటున్నాడు. ఆచార్య కథ తనదే అంటూ ఓ రైటర్ ఇలా ఇష్యూ చేస్తున్నాడని.. తిరిగి రివర్స్ కేసు ఫైల్ చేస్తానంటున్నాడు కొరటాల శివ.
కొరటాల శివ రిటైర్మెంట్ ప్లాన్స్ (koratala siva retirement)
కొరటాల శివ (koratala siva)

మీ కథ మీదే.. నాది ఈ కథ కాదు స్వామి అంటూ మొత్తుకుంటుంటే కూడా రాజేష్ మండూరి వినడం లేదని.. నా కథనే మీకు తెలియకుండా తీస్తున్నారంటూ తిరిగి తనపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చెప్పాడు కొరటాల. ఏదేమైనా కూడా ఇష్యూను కోర్టుకు తీసుకెళ్లి తానే పెద్దది చేయాలనుకుంటున్నానని చెప్పాడు ఈ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. సమ్మర్ 2021కి సినిమా విడుదల కానుంది.
Published by: Praveen Kumar Vadla
First published: August 29, 2020, 6:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading