స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పుష్ప పేరుతో తెరకెక్కుతున్న ఆ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్‌ను అల్లు అర్జును పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసింది చిత్రబృందం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్ రఫ్ అండ్ రస్టిక్‌గా ఉండి అదిరిపోయింది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోన్న ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ క్యాన్సల్ అయింది. ఇక పాన్ ఇండియా లెవెల్లో తెరకెకెక్కించబోతున్నాఈ సినిమాలో ఓ స్టార్ హీరోను విలన్‌గా చూపించబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టిని విలన్ పాత్ర కోసం సంప్రదించిందట చిత్రబృంతం. తన పాత్ర ఆసక్తికరంగా ఉండటంతో ఆయన కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకోబోతున్నారట. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన నటిస్తోంది.

అల్లు అర్జున్ సుకుమార్ (Allu Arjun Sukumar)
అది అలా ఉంటే రెండు నెలల కింద ఆగిపోయినా ఈ చిత్రం షూటింగ్ ఎలాగోలా తిరిగి ప్రారంభించాలనీ చూస్తోంది చిత్రబృందం. కరోనా లాక్ డౌన్ పూరైన తర్వాత మొదలు పెడుదామని అనుకుంటే.. ఇప్పట్లో కరోనా తగ్గేలా లేదు. ప్రభుత్వం అనుమతిచ్చినా షూటింగ్స్ మొదలయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో "పుష్ప" ప్లాన్స్ కూడా మారిపోతున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ కేరళ అనుకున్నారు.. అయితే కరోనా వల్ల షూటింగ్‌ను తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ కు దగ్గర్లో ఉన్న మహబూబ్ నగర్ అటవీ ప్రాంతంలో సినిమాను షూట్ చేయాలని నిర్ణయించింది చిత్రబృందం. ఇక్కడే ఎందుకంటే హైదరాబాద్ పరిసరాల్లో ఉండటం వల్ల మొత్తం యూనిట్‌ను షిఫ్ట్ చేయకుండా.. ఏరోజుకారోజు సిబ్బంది రావాడినికి వీలుగా ఉంటుందని చిత్రబృందం భావిస్తోందట. అయితే దీనికంటే ముందు రామోజీ ఫిలింసిటీలో ఓ షెడ్యూల్ మొదలవుతుంది. ఈ మేరకు ఫిలింసిటీలో ఓ భారీ సెట్ నిర్మాణం జోరుగా సాగుతోంది. అది కూడా అడవి సెట్టేనట. అందులో ఓ ఐటెంసాంగ్ తో పాటు కొన్ని సీన్స్ తీయాలని అనుకుంటోంది చిత్రబృందం.

అల్లు అర్జున్, కొరటాల శివ (Twitter/Photo)
ఇక ఈ సినిమా తర్వాత బన్ని కొరటాల శివతో చేయనున్నాడు. కరోనా కారణంగా ఇంట్లో ఖాలీగా ఉంటున్న శివ.. బన్ని సినిమాకు సంబందించి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడట. దాదాపు ఆ వర్క్ కూడా పూర్తి చేశాడట. శివ ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్యను దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అవ్వగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఇక ఎప్పటిలాగే శివ సినిమాలంటే మెసేజ్ ఒరియెంటేడ్‌గా ఉంటాయని తెలిసిందే. ఈ సినిమా కూడా ఆ కోవలోకే రానుంది. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
Published by:Suresh Rachamalla
First published:July 23, 2020, 11:22 IST