హోమ్ /వార్తలు /సినిమా /

Acharya: అలా చేస్తే తప్పేం కాదు. కొరటాల శివ ఆసక్తికర వ్యాఖ్యలు

Acharya: అలా చేస్తే తప్పేం కాదు. కొరటాల శివ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఆచార్య’లో చిరంజీవి,రామ్ చరణ్ (File/Photo)

‘ఆచార్య’లో చిరంజీవి,రామ్ చరణ్ (File/Photo)

ఆచార్య' రీ షూట్లు జరుపుకున్నట్టుగా వార్తలు వచ్చాయి .. అది నిజమేనా? అనే ప్రశ్న కొరటాల ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. రీ షూట్ చేయడం తప్పేం కాదన్నారు ఆయన.

  మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi),మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం 'ఆచార్య' (Acharya).'ఆచార్య' సినిమా ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ డైరెక్టర్ కొరటాల శివ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఆచార్య' రీ షూట్లు జరుపుకున్నట్టుగా వార్తలు వచ్చాయి .. అది నిజమేనా? అనే ప్రశ్న కొరటాలకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఈ సినిమాకి రీ షూట్లు చేయవలసిన అవసరం రాలేదు. అయినా, రీ షూట్లు చేయడమనేది అపరాథమైనట్టుగా చూడకూడదు .. మాట్లాడకూడదని ఆయన పేర్కొన్నారు.

  దర్శకుడు తాను అనుకున్న సీన్ అనుకున్నట్టుగా రాలేదని ఫీలైతే రీ షూట్ కి వెళ్లడంలో తప్పులేదన్నారు. ఆశించిన స్థాయిలో సీన్ రాకపోయినా, ఫరవాలేదులే అని సర్దుకుపోతే అది తప్పు అవుతుందన్నారు కొరటాల. బెటర్ మెంట్ కోసం రీ షూట్లు జరుగుతూ ఉంటాయి. అవసరమైతే రీ షూట్లు చేయడానికి నేనూ సిద్ధంగానే ఉంటాను" అని సమాధానం చెప్పారు కొరటాల శివ. కొరటాల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు ఆచార్యలో రామ్ చరణ్ పాత్రతో పాటు కాజల్ పాత్ర నిడివి తగ్గించారన్న వార్తలు కూడా హల్ చల్ చేశాయి. ఈ క్రమంలో కొరటాల చేసిన కామెంట్స్‌పై మెగా ఫ్యాన్స్ జోరుగా చర్చించుకుంటున్నారు.

  అదే సమయంలో 'ఆచార్య' కోసం అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. కాజల్ - పూజ హెగ్డే కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. నిరంజన్ రెడ్డి - అవినాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా నుంచి 'భలే భలే బంజారా' అనే గీతం ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్​ సంభాషణతో కూడిన టీజర్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమో వీడియోను పంచుకుంది చిత్రబృందం. పూర్తి సాంగ్ ను సోమవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తామని తెలిపింది. 'భలే భలే బంజారా' సాంగ్ ను రామజోగయ్యశాస్త్రి రాయగా.. మణిశర్మ (Mani Sharma) బాణీలు అందించారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Acharya, Koratala siva, Megastar Chiranjeevi, Pawan kalyan

  ఉత్తమ కథలు