హోమ్ /వార్తలు /సినిమా /

Kajal Aggarwal:ఆచార్య సినిమాలో కాజల్ నటించలేదా? ఏది నిజం?

Kajal Aggarwal:ఆచార్య సినిమాలో కాజల్ నటించలేదా? ఏది నిజం?

Kajal Instagram

Kajal Instagram

ఆచార్య సినిమాలో కాజల్ పాత్రపై క్లారిటీ రావడం లేదు. ట్రైలర్‌లో కూడా ఆమె ఎక్కడా కనిపించలేదు. దీంతో అసలు కాజల్ ఈ సినిమాలో నటిస్తుందా లేదాా అన్న అనుమానాలు వస్తున్నాయి.

    మెగాస్టార్ ఆచార్య సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోంది. దీంతో మూమీ ప్రమోషన్ల జోరు పెంచింది ఆచార్య టీం. ఇటీవలే ఆచార్య ప్రిరిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించారు. అయితే అంతా బాగానే ఉన్నా.. ఆచార్య సినిమా ప్రమోషన్లు, టీజర్లలో ఎక్కడా కూడా హీరోయిన్ కాజల్ ఊసు ఎత్తనేలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముందు నుంచి ఈ సినిమాలో హీరోయిన్ అని ప్రచారం జరుగుతున్న కాజల్ అగర్వాల్ పేరు ఎవరూ కూడా ప్రస్తావించకపోవడం ఆసక్తికరంగా మారింది. ట్రైలర్‌‌లో కూడా కాజల్ ఎక్కడా కూడా కనిపించకపోవడంతో దీంతో ఆమె అసలు ఈ సినిమాలో ఉందా లేదా? అనే అనుమానాలు చాలామందికి తలెత్తాయి. ఇదే విషయంపై అటు రామ్ చరణ్.. .ఇటు కొరాటల శివ ఇద్దరు కూడా క్లారిటీ ఇచ్చారు.

    చందమామ సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా, మగధీరలో రామ్ చరణ్ హీరోయిన్ మిత్రవిందగా.. ఇక ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరుకు కాజల్ మంచి హిట్ ఇచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీకి ఈ భామ లక్కీగా మారింది. అయితే ఈ క్రమంలో ఆచార్యలో చిరు జంటగా కాజల్ నటిస్తోందంటే.. మెగా ఫ్యాన్స్ అంతా సంబరపడ్డారు. ‘ఆచార్య’ షూట్‌లో కాజల్‌ పాల్గొన్న ఫొటోలు, ‘లాహే లాహే’ సాంగ్‌లో సంగీతతో కలిసి కాజల్‌ డ్యాన్స్‌ చేసిన పలు వీడియోలు గతంలో బయటకు వచ్చాయి.దీంతో మెగాస్టార్‌కు జోడీగా కాజల్ పక్కా అనుకున్నారు. అయితే తాజాగా విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌లలో కాజల్‌ ఎక్కడా ఈ చందమామ కనిపించలేదు. సినిమా ప్రమోషన్స్‌లోనూ ఆమె పేరు వినిపించడం లేదు.

    దీంతో ఇదే విషయంపై డైరెక్టర్ కొరటాల శివ తాజాగా స్పందించారు. ‘ఆచార్య’ నుంచి కాజల్‌ని తొలగించినట్లు తెలిపారు. ‘‘మొదట సినిమా అనుకున్నప్పుడు హీరోకి జోడీగా హీరోయిన్‌ ఉంటే బాగుంటుందనిపించింది. ధర్మస్థలిలో ఉండే ఓ అమ్మాయిగా కాజల్‌ పాత్ర క్రియేట్‌ చేశాం. నాలుగు రోజులు షూట్‌ చేశాం. పాత్ర రాసుకున్నాం, షూట్‌ చేశాం కానీ, ‘ఆచార్య’ పాత్రకు లవ్‌ ఇంట్రస్ట్‌ ఉంటే బాగుంటుందా? లేదా? అనే విషయంపై సందేహం కలిగిందని కొరటాల తెలిపారు. నక్సలిజం సిద్ధాంతాలున్న వ్యక్తికి లవ్‌ ఇంట్రస్ట్‌ పెడితే బాగోదని, సినిమాలో హీరోయిన్‌ పాత్ర ఉండాలి కాబట్టి ఏదో ఒక పాత్రను సృష్టించి అంత పెద్ద హీరోయిన్‌తో చేయిస్తే బాగోదనిపించింది.

    మరోవైపు ఆ పాత్రకు పాటలు కూడా లేవు, సరైన ముగింపు కూడా లేదు.. ఇవన్నీ ఆలోచించి ఓసారి చిరంజీవితో ఇదే విషయాన్ని చెప్పానన్నారు కొరటాల. అయితే ‘కథకు ఏది అవసరమో అదే చెయ్‌. నీకున్న సందేహాన్ని అందరితో పంచుకో’ అని చిరంజీవి తనతో చెప్పారన్నారు. అదే విషయాన్ని కాజల్‌కి అర్థమయ్యేలా చెప్పాను. ఆమె అర్థం చేసుకుని.. ‘నేను మీ అందర్నీ మిస్‌ అవుతున్నా. భవిష్యత్తులో తప్పకుండా సినిమా చేద్దాం’ అని చెప్పారన్నారు. అలా, ఆమెను ఈ చిత్రం నుంచి తొలగించామని కొరటాల శివ వివరించారు. అయితే, ‘లాహే లాహే’ సాంగ్‌లో కాజల్‌ కనిపిస్తారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని శివ అన్నారు.

    అయితే చెర్రీ మాత్రం కాజల్‌ సినిమాలో ఉంటుందా లేదా అన్న దానిపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో చెర్రీని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ కాజల్ పాత్ర ఎలా ఉందో చెప్పడానికి తాను సినిమా ఫైనల్ ఎడిట్ చూడలేదని రామ్ చరణ్ పేర్కొన్నాడు. అంతేకాదు ట్రైలర్ కట్ కూడా కొరటాల శివ కోరుకున్న విధంగానే చేశాడని చెప్పుకొచ్చాడు.

    Published by:Sultana Shaik
    First published:

    Tags: Acharya, Kajal agarwal, Koratala siva, Megastar Chiranjeevi, Ram Charan

    ఉత్తమ కథలు