‘నాన్నకు ప్రేమతో‘ అంటూ చిరంజీవితో ఉన్న ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్..

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ.

news18-telugu
Updated: August 22, 2019, 10:55 AM IST
‘నాన్నకు ప్రేమతో‘ అంటూ చిరంజీవితో ఉన్న ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్..
తండ్రి చిరంజీవితో తనయుడు రామ్ చరణ్ (Twitter/Photo)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా రామ్ చరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ. ఈ సందర్భంగా చిరంజీవితో రామ్ చరణ్ తన అనుబంధం గురించి చెప్పాలంటే.. చిరంజీవి నట వారసుడిగా ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాలోనే తండ్రి పేరు చిరు తనయుడు అనే అర్ధం వచ్చేలా ఈ పేరు పెట్టారు. ఆ తర్వాత తండ్రి మెగాస్టార్ నటించిన ‘మగధీరుడు’ సినిమా టైటిల్‌లో ‘మగధీర’ సినిమ ా చేసి టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. అంతేకాదు తండ్రి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను నిర్మించాడు. తాజాగా వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ రకంగా ఐదు భాషల్లో విడుదల కానున్న మొదటి సినిమాగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా రికార్డులకు ఎక్కింది.


మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో తన తండ్రి హీరోగా సినిమాలు నిర్మించిన మూడో వ్యక్తిగా రామ్ చరణ్ నిలిచాడు. గతంలో హరికృష్ణ, నాగార్జున‌లు కూడా తన తండ్రులతో సినిమాలు నిర్మించిన ట్రాక్ రికార్డు ఉంది. కానీ వాళ్లతో పోలిస్తే.. రామ్ చరణ్ మాత్రం ఒకవైపు భారీ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తండ్రి హీరోగా భారీ యాక్షన్ నేపథ్యమున్న చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఏమైనా టాలీవుడ్‌లో తండ్రి కొడుకులుగా చిరంజీవి,రామ్ చరణ్‌లది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి.

First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>