హోమ్ /వార్తలు /సినిమా /

Kondapolam : వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ కొండపొలం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఉప్పెన ఫస్ట్ డే కలెక్షన్స్ కన్నా దారుణం..

Kondapolam : వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ కొండపొలం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. ఉప్పెన ఫస్ట్ డే కలెక్షన్స్ కన్నా దారుణం..

కొండపొలం క్లోజింగ్ కలెక్షన్స్ (Twitter/Photo)

కొండపొలం క్లోజింగ్ కలెక్షన్స్ (Twitter/Photo)

Kondapolam  First Weekend Collections : ఈ యేడాది ‘ఉప్పెన’ సినిమాతో వెండితెరకు పరిచమైన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకున్నారు.

Kondapolam  First Weekend Collections : ఈ యేడాది ‘ఉప్పెన’ సినిమాతో వెండితెరకు పరిచమైన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకున్నారు. మెగా మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. ఫస్ట్ మూవీతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు కరోనా సమయంలో కూడా  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 100 గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ఇక   ఆయన నటించిన రెండో సినిమా ’కొండపొలం’. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అతనికే చెందిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి టాకే తెచ్చుకుంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ విషయానికి వస్తే... బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా  ఎంత వసూళ్లను సాధించిందంటే..

ఏరియాల వారిగా కలెక్షన్స్…

Nizam (తెలంగాణ): 72L

Ceeded (రాయలసీమ): 29L

UA: 52L

East: 27L

West: 21L

Guntur: 32L

Krishna: 22L

Nellore: 16L

AP-TG Total:- 2.71CR(1.95CR Gross)

Ka+ROI: 24 L

OS – 7L

Total WW: 2.95CR)

Love Story : లవ్ స్టోరి 15 డేస్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని.. లాభాల బాటలో...

ఈ సినిమాను 7.5 కోట్ల రేటుకి అమ్మగా సినిమా 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ సినిమా ఇంకారూ.5 కోట్ల షేర్ ని అందుకుంటే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

ఇక కొండపొలం కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్‌గా ఓబులమ్మ అనే పాత్రను చేసింది.

చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..

క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారట. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకుంది. ఆ మధ్య ఈ సినిమా నుండి విడుదలైన పాటకు మంచి ఆదరణ వచ్చింది.ఇక వైష్ణవ్‌ తేజ్‌ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన దర్శకుడు గీరిషయ్య డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. భోగవల్లి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు వైష్ణవ్ తేజ్‌తో పలువురు నిర్మాతలు చిత్రాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. మొత్తంగా తొలి సినిమా ’ఉప్పెన’తో పోల్చితే.. ‘కొండపొలం’ సినిమా అనుకున్నంత రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టలేకపోతోంది.

First published:

Tags: Kondapolam, Krish, Rakul Preet Singh, Vaishnav tej

ఉత్తమ కథలు