Kondapolam Closing Box Office Collections : ఈ యేడాది ‘ఉప్పెన’ సినిమాతో వెండితెరకు పరిచమైన వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే భారీ సక్సెస్ అందుకున్నారు. మెగా మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశారు. అంతేకాదు కరోనా సమయంలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 100 గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది. ఇక ఆయన నటించిన రెండో సినిమా ’కొండపొలం’. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అతనికే చెందిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. 8 అక్టోబర్‌న విడుదలైన ఈ సినిమా మూడు వారాలు పూర్తి చేసుకుది. ‘కొండపొలం’ సినిమాకు మంచి టాకే తెచ్చుకుంది. అయినా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అంతగా మాయ చేయలేకపోయింది. మొత్తంగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఫైనల్‌గా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎంత వసూళ్లను సాధించిందంటే..
ఏరియాల వారిగా కలెక్షన్స్…
Nizam (తెలంగాణ): 9 8L
Ceeded (రాయలసీమ): 44 L
UA: 65 L
East: 36L
West: 27L
Guntur: 39L
Krishna: 30L
Nellore: 20L
AP-TG Total:- 3.59CR(1.95CR Gross)
Ka+ROI: 31 L
OS – 7L
Total WW: Rs 3.90 Crores
‘కొండపొలం’ మూవీ రూ. 7.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. మొత్తంగా ఈ సినిమా రూ. 3.90 కోట్ల థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా ఉప్పెన్ మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కంటే దారుణంగా ఈ సినిమా కలెక్ట్ చేసింది. మొత్తంగా ఈ సినిమాను కొన్న బయ్యర్లు దాదాపు రూ. 4 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
ఇక కొండపొలం కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓ ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా రూపోందించారు దర్శకుడు క్రిష్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ డిగ్లామర్‌గా ఓబులమ్మ అనే పాత్రను చేసింది.
చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి..
క్రిష్ ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ చిత్రాన్ని వికారాబాద్ ఫారెస్ట్‌లో ఎక్కువు శాతం చిత్రీకరించారు. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ స్ట్రీమింగ్ సంస్థ దక్కించుకుంది. ఆ మధ్య ఈ సినిమా నుండి విడుదలైన పాటకు మంచి ఆదరణ వచ్చింది.ఇక వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన దర్శకుడు గీరిషయ్య డైరెక్షన్‌లో ఓ సినిమాను చేస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు వైష్ణవ్ తేజ్‌తో పలువురు నిర్మాతలు చిత్రాలు నిర్మించడానికి రెడీ అవుతున్నారు. మొత్తంగా తొలి సినిమా ’ఉప్పెన’ సినిమా ఫస్ట్ డేకు వచ్చిన కలెక్షన్స్ ‘కొండపొలం’ సినిమా మొత్తం థియేట్రికల్ రన్‌లో రాబట్టలేకపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kondapolam, Krish, Rakul Preet Singh, Tollywood, Tollywood Box Office Report, Vaishnav tej