Home /News /movies /

KONCHADA SRINIVAS TOLLYWOOD ACTOR SHANKAR DADA ARUNDHATI MOVIE FAME PASSED AWAY DUE TO ILL HEALTH TA

Konchada Srinivas : సినీ పరిశ్రమలో మరో విషాదం.. శంకర్ దాదా నటుడు కొంచాడ శ్రీనివాస్ కన్నుమూత..

ప్రముఖ నటుడు కొంచాడ శ్రీనివాస్ కన్నమూత (File/Photo)

ప్రముఖ నటుడు కొంచాడ శ్రీనివాస్ కన్నమూత (File/Photo)

Konchada Srinivas : సినీ పరిశ్రమలో మరో విషాదం.. శంకర్ దాదా నటుడు కొంచాడ శ్రీనివాస్ కన్నుమూసారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఈయన ఈ బుధవారం కన్నుమూసారు.

    Konchada Srinivas : సినీ పరిశ్రమలో మరో విషాదం.. శంకర్ దాదా నటుడు కొంచాడ శ్రీనివాస్ కన్నుమూసారు. 2021లో టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు అనారోగ్యంతో పాటు కరోనా కన్నుమూసారు. 2022లో అంతా బాగుంటుంది అనుకుంటే.. ఈ యేడాది ప్రముఖ సీనియర్ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూసారు. మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు .. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో అకాల మరణం చెందారు. మరోవైపు ప్రముఖ కొరియోగ్రాఫర్ బిర్జూ మహారాజ్ అనారోగ్యంతో కన్నుమూసారు. ఈ ఘటనలు మరవక ముందే మరో నటుడు కొంచాడ శ్రీనివాస్ అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన శంకర్ దాదా, అరుంధతి వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంచాడ శ్రీనివాస్ వయసు 47 యేళ్లు. ఈయన ఈ బుధవారం (జనవరి 19)న కన్నుమూసారు.

    ఈయన ఆంధ్ర ప్రదేశ్.. శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీబుగ్గలో ఉన్న ఓ ప్రైవేటు హాస్పటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకంటూ తుది శ్వాస విడిచారు. శ్రీనివాస్ ఓ షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఈయన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అప్పటి నుంచి ఛాతి భాగంలో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ తర్వాత వైద్య పరీక్షల తర్వాత ఈయనికి హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లెమ్ ఉన్నట్టు డాక్లర్టు వెల్లడించారు. అప్పటి నుంచి  ఈయన పలు అనారోగ్య సమస్యలతో సతమతవుతున్నారు. శ్రీనివాస్ మృతితో పాటు ఆయన స్వస్థలంతో పాటు సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    Chiranjeevi - Ravi Teja : చిరు, బాబీ సినిమాలో యాక్ట్ చేయడానికి రవితేజ రికార్డు రెమ్యునరేషన్..

    ప్రతీ సంవత్సరం ఈయన కుటుంబంతో కలిసి తన స్వస్థలంలో సంక్రాంతి పండగ జరుపుకుంటూ ఉంటారు. ఈ ఇయర్ కూడా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి పండగ చేసుకుంటున్న సందర్భంగా తీవ్ర అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలయ్యారు. ఈ కోవలో ఈయన ఆరోగ్యం క్షీణించి మృతి చెందారు.

    బాలీవుడ్‌లో రికార్డు స్థాయిలో విడుదల కానున్న అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురుములో’..

    ప్రతీ సంక్రాంతికి శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి కాశీబుగ్గకు వెళ్లి కుటుంబంతో పండగను జరుపుకుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పండగ నిమిత్తం కాశీబుగ్గ వెళ్లారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న సమయంలోనే ఆయన అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. శ్రీనివాస్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈయన 40 కి పైగా చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ‘శంకర్ దాదా ఎంబీబీఎస్, అరుంధతి, ప్రేమకావాలి వంటి చిత్రాలు ఈయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఈయన తల్లి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఉంటున్నారు. ఈయన తండ్రి ఐదేళ్ల క్రితం కన్నుమూసారు. పదేళ్ల క్రితం సోదరుడు కూడా మృతి చెందారు. ఈయన పెళ్లి చేసుకోలేదు.  తాజాగా ఈయన మృతితో కొంచాడ శ్రీనివాస్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన మృతిపై సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు