KOMURAM BHEEMUDO VIDEO SONG FROM RRR RELEASED GETS GOOD RESPONSE SR
RRR | Komuram Bheemudo : కొమురం భీముడో పూర్తి పాట విడుదల.. ఎన్టీఆర్ నటనకు ఫిదా అవ్వాల్సిందే..
Komuram Bheemudo Song
Photo : Twitter
RRR | Komuram Bheemudo Song : ఈ సినిమా గురించి మరో పాట విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాటు నాటు, కొమ్మ ఉయ్యాల, దోస్తీ వంటి పాటలు విడుదలై యూట్యూబ్‌లో కేక పెట్టిస్తోండగా.. మరో పాట కొమురం భీముడో విడుదలైంది. ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా కీరవాణీ కొడుకు భైరవ పాడారు.
RRR : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 14 మిలియన్ డాలర్స్‌పైగా వసూలు చేసి 100 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. అయితే అమెరికాలో ఈ ఫీట్ సాథించిన మరో సినిమా బాహుబలి 2 (Bahubali).. ఇండియా నుంచి ఈ రెండు సినిమాలు అమెరికాలో 100 కోట్ల గ్రాస్‌ను అందుకున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ రెండు సినిమాలు కూడా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చినవే. ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా 605.78 కోట్ల షేర్‌తో ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది.
ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో పాట విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాటు నాటు, కొమ్మ ఉయ్యాల, దోస్తీ వంటి పాటలు విడుదలై యూట్యూబ్‌లో కేక పెట్టిస్తోండగా.. మరో పాట కొమురం భీముడో విడుదలైంది. ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా కీరవాణీ కొడుకు భైరవ పాడారు. ఈ పాటకు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ వీడియో పాటలో ఎన్టీఆర్ నటన అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. చూడాలి మరి ఈ వీడియో సాంగ్ ఎన్ని వందల వ్యూస్‌ను దక్కించుకుంటుందో.. ఇక ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు.
The song that touched millions of souls and hearts across the world#KomuramBheemudho full video song out now
మరోవైపు ఈ (RRR) చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ (RRR) మార్చి 20 నుంచి పే ఫర్ వ్యూ పద్దతిలో జీ ఫ్లెక్స్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా హిందీ ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. హిందీలో ఈ సినిమా 25 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని సమాచారం. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.