Home /News /movies /

KOMMA UYYALA SONG FROM RAM CHARAN RAJAMOULI NTR RRR RELEASED GETS SUPER RESPONSE SR

RRR | Komma Uyyala : గుండె లోతుల్నీ తాకుతోన్న కొమ్మ ఉయ్యాల పూర్తి పాట... అదిరిన రెస్పాన్స్..

RRR Twitter

RRR Twitter

RRR | Komma Uyyala : సినిమా నుంచి ఓ సర్ప్రైజింగ్ సాంగ్ వచ్చేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో సుద్దాల అశోక్ తేజ రాసిన మరో పాట కొమ్మ ఉయ్యాల. ఈ పాట సినిమాలో కీలకపాత్ర పోషించింది. ఈ పాట ఇప్పటి వరకు విడుదల కాలేదు. దీంతో ఈ పాట కోసం తెలుగు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాట ఈరోజు ఏప్రిల్ 16న సాయంత్రం 4 గంటలకి విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది.

ఇంకా చదవండి ...
  ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా నుంచి ఓ సర్ప్రైజింగ్ సాంగ్ వచ్చేసింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో సుద్దాల అశోక్ తేజ (Suddhala Ashoka Teja )రాసిన మరో పాట కొమ్మ ఉయ్యాల (Komma Uyyala). ఈ పాటను చిన్నారి ప్రకృతి రెడ్డి పాడింది. ఈ పాట సినిమాలో కీలకపాత్ర పోషించింది. దీంతో ఈ పాట కోసం తెలుగు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ పాట ఈరోజు ఏప్రిల్ 16న సాయంత్రం 4 గంటలకి విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ఈ పాట విన్న నెటిజన్స్ భావోద్వేగం చెందుతూ కామెంట్స్ చేస్తున్నారు. పాట అదిరిందని, గుండె లోతుల్నీ తాకుతుందని కామెంట్స్ చేస్తున్నారు.  ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఆర్ ఆర్ ఆర్ పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లను వసూలు చేసింది. మరోవైపు ఈ సినిమాకు అటు అమెరికాతో పాటు పలు యూరోప్ దేశాల్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో చిత్రబృందం ఈ సినిమాను ఓ ఇంటర్నేషనల్ లెవల్‌లో దాదాపుగా 30 దేశాల్లో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ఇంటర్యూలో రామ్ చరణ్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.  తన తాజా ఇంటర్వ్యూలో, రామ్ చరణ్ మాట్లాడుతూ.. RRRని ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా వివిధ దేశాలలో విడుదల చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ సినిమా అక్టోబర్‌లో జపాన్‌లో విడుదలవుతుందని, ప్రమోషన్స్‌లో భాగంగా నేను, ఎన్టీఆర్‌తో సహా యూనిట్ రెండు రోజుల పాటు దేశాన్ని చుట్టేస్తామని రామ్ చరణ్ ఈ సందర్భంగా తెలిపారు.

  అంతేకాదు RRR చైనాలో కూడా విడుదలయ్యే అవకాశం ఉందని చరణ్ పేర్కోన్నారు. అయితే RRR గ్లోబల్ థియేట్రికల్ రిలీజ్ గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి. తెలుస్తోన్న సమాచారం మేరకు రాజమౌళి ఓ ఇంటర్నేషనల్ కట్‌ను రూపోందిచనున్నారని టాక్. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..  ఇక ఆర్ ఆర్ ఆర్ ఇప్పటికే 1000 కోట్ల వరకు వసూలు చేసింది. మరోవైపు నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 13 మిలియన్ డాలర్స్‌‌పైగా వసూలు చేసి 100 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. అయితే అమెరికాలో ఈ ఫీట్ సాథించిన మరో సినిమా బాహుబలి 2 (Bahubali).. ఇండియా నుంచి ఈ రెండు సినిమాలు అమెరికాలో 100 కోట్ల గ్రాస్‌ను అందుకున్నాయి.  ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ రెండు సినిమాలు కూడా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చినవే. ఇక హిందీలో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. అక్కడ 200 కోట్ల‌కు పైగా నెట్‌ను వసూలు చేసింది. ఆర్ ఆర్ ఆర్ (Roudram Ranam Rudhiram) బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుని ఇక రెండో వారంలో కూడా కేక పెట్టిస్తోంది. ఈ సినిమా తొమ్మిదో రోజు టాలీవుడ్ చరిత్రలోనే ఊహకందని విధంగా.. ఏకంగా 19.62 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ప్రభంజనం స‌‌ృష్టించింది. అంతేకాదు తొమ్మిదో రోజు వరల్డ్ వైడ్‌గా ఏకంగా 37.12 కోట్ల షేర్ సొంతం చేసుకుని దుమ్ము లేపింది.


  ఈ సినిమా 22 వ రోజు తెలుగు రాష్ట్రాలలో 84 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా సినిమా వరల్డ్ వైడ్ గా 2.93 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని సూపర్ సాలిడ్‌గా నిలిచింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 578 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. ఇక వరల్డ్ వైడ 1063 కోట్ల రేంజ్‌లో గ్రాస్ ఉండనుంది. ఇక బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే..ఈ సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 453 కోట్లు కాగా.. అది దాటేసి ఇప్పుడు 125.82 కోట్ల ప్రాఫిట్‌తో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ నటులు  (RRR) విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు.  అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు.

  Anchor Suma | Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జయమ్మ పంచాయితీ ట్రైలర్ విడుదల..

  మరోవైపు ఈ  (RRR) చిత్రం ఓటిటి రిలీజ్‌ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్  (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. అయితే హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ (RRR on Netfilx) సొంతం చేసుకోగా.. మిగితా సౌత్ భాషల రైట్స్‌ను జీ5 (Zee5) సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: RRR, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు