హోమ్ /వార్తలు /సినిమా /

మహేశ్,ప్రభాస్ గురించి చెప్పి.. ఏ మెగాస్టార్ ? అన్న పవన్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్

మహేశ్,ప్రభాస్ గురించి చెప్పి.. ఏ మెగాస్టార్ ? అన్న పవన్ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్

నికిషా పటేల్

నికిషా పటేల్

పవన్ కళ్యాణ్‌తో కలిసి సినిమా చేశావు.. నీకు మెగస్టార్ తెలియదా అంటూ..పవన్ ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు.

  పవన్ కళ్యాణ్ హీరోయిన్లు ఒక్కొక్కరు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అత్తారింటికి దారేది సినిమాలో నటించిన ప్రణీత పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయిపోయింది. ఇప్పుడు తాజాగా మరో పవర్ స్టార్ హీరోయిన్ కూడా పెళ్లి కొడుకు దొరికేశాడని చెబుతోంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన కొమరం పులి సినిమాలో నటించి మెప్పించిన నికిషా పటేల్(Nikesha Patel) అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని పేర్కొంది. ట్విట్టర్ లో నెటిజన్లతో చిట్ చాట్ చేసిన నికిషా... వారు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానాలిచ్చింది. నికిషా కొమరం పులి(Komaram puli) సినిమా తర్వాత తెలుగులో కళ్యాణ్ రామ్ సరసన ఓం సినిమాలో నటించింది. ఆ తర్వాత అసలు తెలుగులో కనపడలేదు. అప్పుడప్పుడు తమిళ్ లో సినిమాలు చేసింది.

  అయితే ఫ్యాన్స్‌తో చేసిన చిట్ చాట్‌లో ఆమె నెటిజన్స్ అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం చెబుతూ పోయింది. ఇక పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు నిఖీషా వరుడు దొరికేశాడని, అతడు యూకేలో ఉంటున్నాడని చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని గుడ్‌న్యూస్‌ చెప్పింది. మహేశ్‌బాబు (Mahesh Babu)గురించి చెప్పండి అని అడగ్గా ఫెయిర్‌ అండ్‌ లవ్లీ అని సింగిల్‌ లైన్‌లో జవాబిచ్చింది.

  ఇక ప్రభాస్‌ (Prabhas)పై కూడా నెటిజన్లు ప్రశ్నలు వేశారు. ప్రభాస్ గురించి ఏదైనా చెప్పండి అంటే అతడు తనకు మంచి ఫ్రెండ్‌ అని, కాకపోతే చాలా పొడుగ్గా ఉంటాడంది. రజనీకాంత్‌(Rajnikanth) గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే కింగ్‌ అని ఆన్సరిచ్చింది. ఫేవరెట్‌ యాక్టర్‌ ఎవరంటే మాత్రం ఎప్పటికీ ధనుషే అని బదులిచ్చింది. పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) గడ్డం అంటే ఇష్టమన్న నిఖీషా.. మెగాస్టార్‌ గురించి చెప్పండి అంటే మాత్రం తిరిగి షాకింగ్ క్వశ్చన్ వేసింది. ఇండస్ట్రీలో చాలామంది మెగాస్టార్లు ఉన్నారు. ఇంతకీ మీరు ఏ మెగాస్టార్‌ గురించి అడుగుతున్నారు? అని అడిగింది.


  ఆమె ఆన్సర్‌ విని మెగా ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. 'మెగాస్టార్‌ ఎవరో తెలీదా? పవన్‌తో సినిమా చేశావు, ఆయన బ్రదర్‌ మెగాస్టార్‌ చిరంజీవి అన్న విషయం తెలియదంటే నమ్మబుద్ధి కావడం లేదు' అంటూ మండిపడ్డారు 'ఇందుకే నీకు సినిమా అవకాశాలు రావడంలేదు' అంటూ కాస్త ఘాటుగానే కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం నికిషాకు సపోర్ట్ చేశారు. 'సల్మాన్‌ ఖాన్‌, మమ్ముట్టిని కూడా మెగాస్టార్‌ అంటారు. కాబట్టే ఆమె అలా అడిగింది' అని మరికొందరు సదరు హీరోయిన్‌ను వెనకేసుకొస్తున్నారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Chiranjeevi, Megastar Chiranjeevi, Pawan kalyan

  ఉత్తమ కథలు