దర్శక ధీరుడు రాజమౌళి సాధారణంగా ఎవ్వరి జోలికి వెళ్లడు. తానేదో తన సినిమాలు చేసుకుంటూ కూర్చుంటాడు. అయితే ఆ సినిమాలే అప్పుడప్పుడూ ఆయన్ని కాంట్రవర్సీల్లోకి లాగుతుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నిజానికి ఆయన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లాంటి ఇద్దరు తెలుగు వీరులను పెట్టి సినిమా అనౌన్స్ చేసినపుడే జరగాల్సిన రచ్చ జరిగిపోయింది. అప్పుడే ఆయన ఫిక్సయ్యాడు కచ్చితంగా ఫ్యూచర్లో దీనిపై వివాదాలు రేగుతాయని. అలాంటి వాళ్లను మనమేం చేయలేం.. మన పని మనం చేసుకోవడం తప్ప అంటూ అప్పట్లోనే చెప్పాడు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు ఇదే జరుగుతుంది. మొన్నటికి మొన్న కొమరం భీమ్ 119వ జయంతి కానుకగా భీమ్ ఫర్ రామరాజు టీజర్ విడుదల చేసారు. అందులో భీమ్ పాత్రకు ముస్లిం టోపీ పెట్టించాడు రాజమౌళి. దానిపై కాంట్రవర్సీ చెలరేగుతుంది. చరిత్ర తెలియకుండా యిష్టమొచ్చినట్లు సినిమాలు తీస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరు అంటూ రాజమౌళికి ఇప్పటికే చాలా వార్నింగులు వచ్చాయి. ఇప్పుడు బీజేపీ ఎంపీ సోయం బాపురావు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

రాజమౌళికి ఎంపీ సోయం బాపురావు వార్నింగ్ (rrr rajamouli soyam bapu rao)
ఆయన తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో భీం పాత్రకు పెట్టిన టోపీ వెంటనే తొలగించాలని డిమాండ్ చేసాడు. అలా కాదని అలాగే విడుదల చేస్తే థియేటర్లను తగులబెట్టే అవకాశం ఉందంటూ ఇన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు సోయం బాపురావు. మీ సినిమా కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించబోమంటూ ఈయన హెచ్చరించాడు. ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నాడు సోయం బాపురావు. అక్కడి గోండు తెగకు కొమురం భీమ్ దేవుడు. అప్పట్లో నిజాంకు వ్యతిరేకంగా కొమురం భీం పోరాటం చేసి అమరుడయ్యారని సోయం పేర్కొన్నాడు.

ఆర్ఆర్ఆర్ భీమ్ టీజర్ (RRR Bheem teaser)
భీంను చంపిన వాళ్ళ టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసులను అవమానించడమే అని ఆయన తీవ్రంగా విమర్శించాడు. రాజమౌళి ఇప్పటికైనా చరిత్రను తెలుసుకోవాలని.. లేదంటే మర్యాదగా ఉండదని అని బాపురావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మరి దీనిపై దర్శక ధీరుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:October 27, 2020, 11:46 IST