దళితులను కానీ.. మరే కులాలను కానీ కించపరచడం అనేది తప్పు.. క్షమించరాని నేరం. అలా చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలంటూ చట్టాలు కూడా చెప్తున్నాయి. అయినా కూడా కొందరు మాత్రం నోరు జారుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఓ హీరోయిన్ ఇదే చేసింది. ఏకంగా సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులతో పాటు షెడ్యూల్డ్ కులాలను గెంటేయాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈమె వ్యాఖ్యలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. అంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆ హీరోయిన్ పేరు మీరా మిథున్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తమిళ పరిశ్రమలో షెడ్యూల్డ్ కులాల నుంచి వచ్చిన దర్శకులు, నటులు ఎవరైనా కూడా బయటికి వెళ్లిపోవాలని.. వాళ్లను ఇక్కడ్నుంచి గెంటేయాలని ఆరోపించింది.
ఈమెకు తమిళనాట యూ ట్యూబ్ స్టార్‌గా గుర్తింపు ఉంది. షెడ్యూల్డ్ కులాల వాళ్ల వల్లే క్వాలిటీ సినిమాలు రావడం లేదని.. వాళ్ళ పద్దతులు, వ్యవహారాలు బాగుండవని ఈమె తెలిపింది. తన ఫోటోను ఓ దర్శకుడు తీసుకుని అనుమతి లేకుండా సినిమా ఫస్ట్ లుక్ కోసం వాడారని ఆమె ఆరోపించింది. ఆయన షెడ్యూల్డ్ కులం నుంచి వచ్చిన వాడే అంటుంది మీరా మిథున్.
ఈ పరిశ్రమలో ఉన్న షెడ్యూల్ కులాల వాళ్లకు అనేక నేరాలతో సంబంధం ఉందని వీడియోలో తెలిపింది మీరా. ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తమిళనాట ఈమెపై మండిపడుతున్నాయి దళిత సంఘాలు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా మీరా మిథున్‌పై అనేక చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood Cinema, Tamil Cinema