Home /News /movies /

KOLLYWOOD TAMIL YOUNG HERO AND MLA UDAYANIDHI STALIN ASSETS AND LIABILITIES AND CRIMINAL CASES TA

Udhayanidhi Stalin: అతిపిన్న వయసులో ఎమ్మెల్యే అయిన హీరో ఉదయనిధి స్టాలిన్‌ ఎన్ని కోట్ల ఆస్తులన్నాయో.. అదే రేంజ్‌లో క్రిమినల్ కేసులు..

ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయనిధి స్టాలిన్ (Twitter/Photo)

ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయనిధి స్టాలిన్ (Twitter/Photo)

Udhayanidhi Stalin | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ తనయుడు సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌  చెపాక్  - తిరువళ్లికేని నియోజకవర్గం  నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.

    Udhayanidhi Stalin | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ తనయుడు సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌  చెపాక్  - తిరువళ్లికేని నియోజకవర్గం  నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఒక హీరోగా అతిపిన్న వయసులో ఎన్నికైన నటుడిగా ఉదయనిధి స్టాలిన్ రికార్డు క్రియేట్ చేసారు. ఆయన వయసు 43 ఏళ్లు. 1977 నవంబర్ 27న స్టాలిన్, దుర్గాలకు జన్మించారు. గతేడాదే ఈయన డిఎంకేకు యూత్ వింగ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఈయన తన సమీప పీఎంకే అభ్యర్థి AVK కాసల్లిపై దాదాపు 69,355 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఉదయనిధి స్టాలిన్ తాతగారు దివంగత కరుణానిధి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో డీఎంకే అధిష్ఠానం అతని ముందు టికెట్ నిరాకరించినా.. చివరకు చెన్నైలోని చెపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు  టికెట్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఈయన కూడా అందరి అభ్యర్థుల మాదిరిగానే డీఎంకే అత్యున్నత నిర్ణాయక మండలిలో సభ్యులైన  తండ్రి స్టాలిన్, దురై మురుగున్ ముందు ఇంటర్య్వూకు   హాజరయ్యారు.

    ఎమ్మెల్యేగా పోటీ చేసే ముందు ఈయన తన  ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పులు, కేసుల వివారాలను పొందుపరిచారు. ఉదయనిధి స్టాలిన్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో  స్థిర, చరాస్థులు అన్ని కలిపి రూ. 33 కోట్ల ఆస్తులు ఉన్నట్టు చూపించారు. 2019 -20 యేడాదిగాను రూ. 4.89 లక్షల ఆదాయం ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన భార్య కిరుతిగ పేరుపై రూ. 1.15 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలిపారు.  2019 -20 యేడాదిగానుఆమె ఆదాయం రూ. 17.4 లక్షలు ఉన్నట్టు ఎన్నికల సంఘానికి తెలియజేసారు.

    Kollywood Tamil Young hero and MLA Udayanidhi Stalin Assets and liabilities and Criminal Cases,Udhayanidhi Stalin: అతిపిన్న వయసులో ఎమ్మెల్యే  అయిన హీరో ఉదయనిధి స్టాలిన్‌ ఎన్ని కోట్ల ఆస్తులన్నాయో.. అదే రేంజ్‌లో క్రిమినల్ కేసులు..
    ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయనిధి స్టాలిన్ (Twitter/Photo)


    మరోవైపు ఉదయనిధి స్టాలిన్ చరాస్తుల విషయానికొస్తే.. రూ. 21.13 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. భార్య కిరుతిగ పేరు మీద రూ. 1 కోటి 15 లక్షల చరాస్థులు ఉన్నాయి.  ఇద్దరు పిల్లల మీద రూ. 25 లక్షల చరాస్థులు ఉన్నట్టు తెలియజేసారు. మరోవైపు స్థిరాస్థులు విషయానికొస్తే.. రూ. 6.54 కోట్ల విలువైన ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. భార్య, పిల్లల మీద  రూ. 26. 67 కోట్ల స్థిరాస్థులు ఉన్నట్టు తెలిపారు. మొత్తంగా రూ. 30 కోట్ల వరకు స్థిరాస్థులున్నట్టు పేర్కొన్నారు. మార్కెట్ విలువ ప్రకారం చూస్తే.. రూ. 100 కోట్ల పైనే ఉంటుందని సమాచారం.

    Udhayanidhi Stalin,tamil nadu Assembly Elections 2021,Udhayanidhi Stalin chennai chepauk Assembly Constituency,tollywood Actors,kollywood,Tamilnadu,ఉదయనిధి స్టాలిన్,తమిళనాడు ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్,తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి మనవడు హీరో ఉదయనిధి స్టాలిన్
    తమిళనాడు ఎన్నికల బరిలో గెలిచిన స్టాలిన్ కుమారుడు ఉదయనిధి (Twitter/Photo)


    ఉదయనిధి స్టాలిన్ ఆస్తుల చిట్టాలనే కాదు.. ఆయనపై పలు 22కు పైగా క్రిమినల్ కేసులు కూడా నమోదు అయ్యాయి. ముఖ్యంగా సైదా పేట్, కల్లకురిచి, గిండి, నుంగంబాకం, తిరుక్కువేలాయై, నాగపట్నం, కుతలం పోలీస్ స్టేషన్స్‌లో ఈయనపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులన్ని డీఎంకే ఆధ్వర్యంలో చేసిన ధర్నాలతో పాటు అసెంబ్లీ ముట్టడి వంటి వాటిలో ఈ కేసులు నమోదు అయ్యాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Kollywood, Tamil Nadu Assembly Elections 2021, Taminadu, Udhayanidhi Stalin

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు