హిమాలయాలకు పయనమైన సూపర్ స్టార్ రజనీకాంత్..
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయాలకు పయనమయ్యారు. ఈ రోజు ఉదయం 6.40కి చెన్నై విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఆయన.. డెహ్రాడూన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో కొంత దూరం వెళ్లి అక్కడి నుంచి కాలి నడకన హిమాలయాలకు వెళ్లనున్నారు.

హిమాలయాలకు పయనమవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్
- News18 Telugu
- Last Updated: October 14, 2019, 3:13 PM IST
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయాలకు పయనమయ్యారు. ఈ రోజు ఉదయం 6.40కి చెన్నై విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఆయన.. డెహ్రాడూన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో కొంత దూరం వెళ్లి అక్కడి నుంచి కాలి నడకన హిమాలయాలకు వెళ్లనున్నారు. మార్గమధ్యలో బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఉన్న దయానంద ఆశ్రమంలో కాసేపు గడిపారు. మూడు రోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. బాబాజీ గుహను కూడా రజనీ సందర్శించారు. ప్రతి సినిమా షూటింగ్ పూర్తయ్యాక హిమాలయాలకు వెళ్లే అలవాటు ఉన్న రజనీకాంత్ ఈ సారి అక్కడ పది రోజుల పాటు గడపనున్నారు. 2010 వరకు ప్రతి సినిమా పూర్తయ్యాక ప్రకృతి సోయగాలను ఆస్వాదించిన సూపర్ స్టార్.. ఆ తర్వాత అనారోగ్య కారణాల రీత్యా హిమాలయాల పర్యటనను విరమించుకున్నారు. అయితే, గాలా, రోబో 2.0 సినిమాలు చేశాక హిమాలయాలకు వెళ్లొచ్చారు.
తాజాగా, దర్బార్ సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో ఆయన హిమాలయాలకు పయనమయ్యారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. రజనీకాంత్ ఖాకీ డ్రెస్‌లో అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
రజనీకాంత్ హిమాలయాల పర్యటన ముగించుకొని వచ్చాక శివ దర్శకత్వం వహించనున్న సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించనుంది. రజనీకాంత్‌కు అది 168వ సినిమా కానుంది.

Loading...