హోమ్ /వార్తలు /సినిమా /

హిమాలయాలకు పయనమైన సూపర్‌ స్టార్ రజనీకాంత్..

హిమాలయాలకు పయనమైన సూపర్‌ స్టార్ రజనీకాంత్..

హిమాలయాలకు పయనమవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్

హిమాలయాలకు పయనమవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయాలకు పయనమయ్యారు. ఈ రోజు ఉదయం 6.40కి చెన్నై విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఆయన.. డెహ్రాడూన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో కొంత దూరం వెళ్లి అక్కడి నుంచి కాలి నడకన హిమాలయాలకు వెళ్లనున్నారు.

ఇంకా చదవండి ...

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయాలకు పయనమయ్యారు. ఈ రోజు ఉదయం 6.40కి చెన్నై విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఆయన.. డెహ్రాడూన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి కారులో కొంత దూరం వెళ్లి అక్కడి నుంచి కాలి నడకన హిమాలయాలకు వెళ్లనున్నారు. మార్గమధ్యలో బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాలను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఉన్న దయానంద ఆశ్రమంలో కాసేపు గడిపారు. మూడు రోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. బాబాజీ గుహను కూడా రజనీ సందర్శించారు. ప్రతి సినిమా షూటింగ్ పూర్తయ్యాక హిమాలయాలకు వెళ్లే అలవాటు ఉన్న రజనీకాంత్ ఈ సారి అక్కడ పది రోజుల పాటు గడపనున్నారు. 2010 వరకు ప్రతి సినిమా పూర్తయ్యాక ప్రకృతి సోయగాలను ఆస్వాదించిన సూపర్ స్టార్.. ఆ తర్వాత అనారోగ్య కారణాల రీత్యా హిమాలయాల పర్యటనను విరమించుకున్నారు. అయితే, గాలా, రోబో 2.0 సినిమాలు చేశాక హిమాలయాలకు వెళ్లొచ్చారు.

తాజాగా, దర్బార్ సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో ఆయన హిమాలయాలకు పయనమయ్యారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. రజనీకాంత్ ఖాకీ డ్రెస్‌లో అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నారు. సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

రజనీకాంత్ హిమాలయాల పర్యటన ముగించుకొని వచ్చాక శివ దర్శకత్వం వహించనున్న సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించనుంది. రజనీకాంత్‌కు అది 168వ సినిమా కానుంది.

Published by:Shravan Kumar Bommakanti
First published:

Tags: Rajnikanth, Uttarakhand

ఉత్తమ కథలు