Simbu: 30 కేజీలు తగ్గిన స్టార్ హీరో.. షాక్ అవుతున్న అభిమానులు..

శింబు మేకోవర్ (simbu makeover)

Simbu: మన హీరోలు ఒక్కోసారి చేసే పనులు చూస్తుంటే షాక్ అవుతుంటారు అభిమానులు. ముఖ్యంగా బరువు తగ్గే విషయంలో మాత్రం హీరోలు చాలా కఠినంగా ఉంటారు. పాత్రల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటారు.

  • Share this:
మన హీరోలు ఒక్కోసారి చేసే పనులు చూస్తుంటే షాక్ అవుతుంటారు అభిమానులు. ముఖ్యంగా బరువు తగ్గే విషయంలో మాత్రం హీరోలు చాలా కఠినంగా ఉంటారు. పాత్రల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటారు. తెలుగులో కూడా చాలా మంది హీరోలు బరువు తగ్గి షాక్ ఇచ్చారు. అప్పట్లో బందరు లడ్డూలా ఉండే జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత యమదొంగ నుంచి కారంపూసలా మారిపోయాడు. ఆయనతో పాటు చాలా మంది హీరోలు కూడా బరువు తగ్గి షాక్ ఇచ్చారు. ఇప్పుడు మరో హీరో కూడా ఇదే చేసాడు. ఆయన మేకోవర్ చూసి షాక్ ఇచ్చాడు అందరికీ. అతడే కోలీవుడ్ హీరో శింబు. తమిళనాట మనోడికి లిటిల్ సూపర్ స్టార్‌గా మంచి పేరుంది. దాంతో పాటు ఎఫైర్స్ కింగ్ అనే పేరు కూడా ఉంది. ఈ మధ్య జోరు కాస్త తగ్గించాడు కానీ సరైన హిట్ పడితే మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తాడు శింబు. అయితే ఇప్పుడు ఈయన తన మేకోవర్‌తో అందరికీ షాకిచ్చాడు. ఈ మధ్య చాలా బొద్దుగా కనిపించిన శింబు.. ఇప్పుడు మెరుపుతీగ అయిపోయాడు.
simbu,simbu twitter,simbu instagram,simbu movies,simbu makeover,simbu shocking makeover,simbu lost his weight,telugu cinema,శింబు,శింబు సినిమాలు,శింబు బరువు తగ్గడం
శింబు మేకోవర్ (simbu makeover)

101 కేజీల బరువు నుంచి 70 కేజీలకు తగ్గి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు తగ్గిన ఫోటోలు చూసి ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది కేవలం సినిమాల కోసం కాకుండా తాను వ్యక్తిగతంగా అనుకుని చేసాడు శింబు. తనను తాను నిరూపించుకోడానికి ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నాడు శింబు. ఇదే విషయం అభిమానులకు కూడా చెప్పాడు ఈయన. ఇప్పుడు శింబు హీరోగా నటిస్తున్న ఈశ్వరన్ సినిమా సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉంది.
Published by:Praveen Kumar Vadla
First published: