హోమ్ /వార్తలు /సినిమా /

Vijay: విజయ్ వారసుడు ఓవర్సీస్‌కు భారీ ఆఫర్.. !

Vijay: విజయ్ వారసుడు ఓవర్సీస్‌కు భారీ ఆఫర్.. !

Photo Twitter

Photo Twitter

ఓవర్సీస్‌కు చెందిన ఫార్స్ ఫిలింస్ వారసుడు చిత్ర తమిళ వర్షన్‌కు చెందిన ఓవర్సీస్ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) హీరోగా రాబోతున్న కొత్త సినిమా వారసుడు.  ఈ  సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ వారసుడుగా  ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు మేకర్స్. విజయ్ 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు రావోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  విజయ్ పుట్టినరోజు సందర్భంగా మరో రెండు కొత్త పోస్టర్స్ రిలీజ్  చేశారు.


  అయితే ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో తెలుగులోనూ మరోసారి అదిరిపోయే మార్కెట్’ను సొంతం చేసుకోవాలని విజయ్ భావిస్తున్నాడు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా అప్పుడే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్‌ను భారీ రేటుకు కొనుగోలు చేసినట్లుగా సమాచారం. ఓవర్సీస్‌కు చెందిన ఫార్స్ ఫిలింస్ వారసుడు చిత్ర తమిళ వర్షన్‌కు చెందిన ఓవర్సీస్ రైట్స్‌ను భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.  ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన (Rashmika Mandanna) నటిస్తుండటం జనాల్లో మరింత ఆసక్తి పెంచింది. రష్మిక స్కూల్ ఏజ్ నుంచే విజయ్ ఫ్యాన్, విజయ్ అంటే చాలా ఇష్టమట. హీరోయిన్ అవుతుందా లేదా అనేది అప్పటికి తెలియదు కానీ తనకు దళపతి విజయ్ అంటే ఎంతో ఇష్టమని రష్మిక తెలిపింది. ఆయన లోని సింప్లిసిటీ తనకు బాగా నచ్చుతుందని రష్మిక తెలిపింది.


  ఇక ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రభు, శరత్ కుమార్, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, తమన్ ప్రకాష్ రాజ్, జయసుధ, సంగీత, సంయుక్త తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అందమైన లొకేషన్స్‌లో శరవేగంగా జరుపుతున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Rashmika mandanna, Tamil actor vijay, Thalapathy Vijay

  ఉత్తమ కథలు