సైరాలోని ఆ స్టార్ హీరో రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన సైరాలో తమిళనాడు మూలాలు ఉన్న వీరుడిగా నటించాడు విజయ్ సేతుపతి.

news18-telugu
Updated: September 26, 2019, 8:04 PM IST
సైరాలోని ఆ స్టార్ హీరో రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..
సైరా పోస్టర్
  • Share this:
కోలీవుడ్‌లో స్టార్ రేంజ్‌ను ఎంజాయ్ చేసే హీరోలు... తెలుగులోనూ తమ మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది కోలీవుడ్ స్టార్స్ సక్సెస్ అయ్యారు కూడా. రజనీకాంత్, కమలహాసన్, సూర్య, కార్తీ, విక్రమ్...ఇలా చెప్పుకుంటే ఈ లిస్టు చాలా పెద్దదే. తాజాగా ఈ లిస్టులో చేరేందుకు కోలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన విజయ్ సేతుపతి కూడా ఎదురుచూస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులను తన యాక్టింగ్ టాలెంట్‌ను పరిచయం చేసేందుకు మంచి ఆఫర్ కోసం ఎదురుచూసిన విజయ్ సేతుపతి... సైరా సినిమాలో వచ్చిన ఆఫర్‌కు వెంటనే ఓకే చెప్పేశాడు.

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన సైరాలో తమిళనాడు మూలాలు ఉన్న వీరుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత టాలీవుడ్ ఆడియెన్స్ తనను కూడా అక్కున చేర్చుకుంటారని ఈ కోలీవుడ్ స్టార్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఉయ్యాలవాడ తో కలిసి ఆంగ్లేయులపై పోరాడే తమిళుడిగా అతడి లుక్ కూడా పాపులర్ అయ్యింది. అయితే సైరా సినిమా కోసం విజయ్ సేతుపతి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతనే విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

sye raa,vijay sethupathi,vijay sethupathi remuneration for sye raa,sye raa narasimha reddy teaser,sye raa trailer,sye raa narasimha reddy,vijay sethupathi speech,sye raa narasimha reddy trailer,sye raa movie,vijay sethupathi about sye raa movie,sye raa narasimha reddy pre release event live,sye raa vijay sethupathi scene,sye raa chiranjeevi,sye raa trailer review,sye raa narasimha reddy live,sye raa narasimha reddy movie,సైరా,విజయ్ సేతుపతి,కోలీవుడ్,మెగాస్టార్ చిరంజీవి,రామ్‌చరణ్,అమితాబ్ బచ్చన్
సైరా..నరసింహారెడ్డిలో విజయ్ సేతుపతి లుక్


కోలీవుడ్‌లో ఒక్కో సినిమాకు దాదాపు రూ. 10 కోట్ల వరకు పారితోషికం అందుకునే విజయ్ సేతుపతి... సైరా సినిమాకు ఎంత తీసుకున్నాడనే అంశంపై సినీవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే సైరాలో నటించినందుకు విజయ్ సేతుపతి 3 నుంచి 4 కోట్ల మేర రెమ్యూనరేషన్ అందుకున్నాడని తెలుస్తోంది. సైరా కోలీవుడ్ వర్షన్ మార్కెట్, ఫలితం అంతా విజయ్ సేతుపతిపైనే ఆధారపడి ఉండటంతో... చిత్ర నిర్మాతలు కూడా ఇందుకు ఓకే చెప్పారని సమాచారం. ఇక సైరాతో పాటు తెలుగులో సాయిధరమ్ తేజ్ నయా మూవీ ఉప్పెనలోనూ ఈ కోలీవుడ్ స్టార్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
Published by: Kishore Akkaladevi
First published: September 26, 2019, 8:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading