తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో దళపతి విజయ్. ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే రజినీ కంటే పైనున్నాడు విజయ్. వరస విజయాలతో నెంబర్ వన్ హీరోగా చక్రం తిప్పుతున్నాడు విజయ్. మొన్న మాస్టర్ సినిమాతో సంక్రాంతికి విజయం అందుకున్నాడు విజయ్. ప్రస్తుతం ఈయన నెల్సన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది విజయ్‌కు 65వ సినిమా. విజయ్ ఇమేజ్‌కు సరిపోయేలా నెల్సన్ దిలీప్ కుమార్ కథ సిద్ధం చేసాడు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు 80 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టబోతున్నారు. ఈ చిత్రంలో రెండు పాటలు స్టార్ హీరో శివకార్తికేయన్ రాయబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది. గతంలో శివకార్తికేయన్ నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ‘కోలమావు కోకిల’ సినిమాలో ‘కళ్యాణ వయసు’ పాట రాసాడు. ఇది సూపర్ హిట్ అయింది. ఈ మధ్యే తన హీరోగా రూపొందుతున్న డాక్టర్ సినిమాలో ‘సో బేబీ’, ‘చెల్లమ్మా’ పాటలకు గేయరచన చేసాడు. ఈ రెండు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. శివ రాసే స్టైల్ నచ్చిన నెల్సన్.. ఇప్పుడు విజయ్ సినిమాకు కూడా రాయాలని కోరాడు.
దాంతో ఈ చిత్రానికి శివకార్తికేయన్ రెండు పాటలు రాయనున్నాడనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈయన నటించిన ‘డాక్టర్’, ‘అయలాన్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Cinema, Tollywood, Vijay