• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KOLLYWOOD STAR HERO SIMU IN NTR AND TRIVIKRAM MOVIE LATEST UPDATE MHN

Ntr - Trivikram: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు ఆ స్టార్ హీరో విలన్‌గా మారుతాడా?

Ntr - Trivikram: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు ఆ స్టార్ హీరో విలన్‌గా మారుతాడా?

Kollywood star hero Simu in Ntr and Trivikram Movie Latest Update

Ntr - Trivikram: ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో ఓ కోలీవుడ్ స్టార్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి

  • Share this:
    యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్(రౌద్రం ర‌ణం రుధిరం) సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. ఈ సినిమా పూర్తి చేయ‌గానే స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాదిలోనూ ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌డానికి రంగం సిద్ధ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్రివిక్ర‌మ్ త‌న సినిమాల్లో ప్ర‌తినాయ‌కుల పాత్ర‌ల‌ను బ‌లంగా, వైవిధ్యంగా చూపిస్తుంటారు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేయ‌బోతున్న సినిమాలోనూ కొత్త విల‌న్‌ను తీసుకు రావ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఇది వ‌ర‌కు సంజ‌య్ ద‌త్ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. తాజాగా ఆ లిస్టులో మ‌రో పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

    ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. త్రివిక్ర‌మ్ కోలీవుడ్‌కి చెందిన ఓ స్టార్ హీరోను తెలుగులో విల‌న్‌గా ప‌రిచ‌యం చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఆ స్టార్ ఎవ‌రో కాదు. శిలంబ‌ర‌స‌న్ అలియాస్ శింబు. మ‌రి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న ఈ వార్త‌ల్లో నిజం ఎంతో తెలియాలంటే కొన్నాళ్లు ఆగ‌క త‌ప్ప‌దు. ఎందుకంటే శింబు దగ్గ‌ర‌కు ప్ర‌తిపాద‌న వెళ్లి ఉండొచ్చు ఏమో కానీ.. ఆయ‌న ఒప్పుకుంటాడా? అనేది ఆలోచించాల్సిన విష‌య‌మే.

    ntr, trivikram, ntr 30, ntr next movie, ntr 30 latest update, ntr and trivikram movie update, bollywood heroine in ntr 30, bollywood heroine in trivikram movie, love yatri heroine in ntr 30, bollywood heroine warina hussain, warina hussain entry into tollywood, tollywood, telugu movie news, త్రివిక్రమ్, ఎన్టీఆర్, ఎన్టీఆర్ 30, SILAMBARASAN, simbu entry into tollywood, శిలంబరసన్, శింబు
    Kollywood star hero Simu in Ntr and Trivikram Movie Latest Update


    అర‌వింద‌స‌మేత వీరరాఘ‌వ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్ర‌మిది. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, హారిక అండ్ హాసిన క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. గ‌త ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసిన త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది.
    Published by:Anil
    First published:

    అగ్ర కథనాలు