Home /News /movies /

KOLLYWOOD STAR HERO AJITH SNATCHES MOBILE OF ONE OF HIS UNMSKED FAN AT POLLING BOOTH HERE ARE THE DETAILS TA

Ajith: తనతో సెల్ఫీ తీసుకోబోయిన అభిమాని ఫోన్ లాక్కొని షాక్ ఇచ్చిన అజిత్.. వీడియో వైరల్..

అభిమాని ఫోన్ లాక్కొన్న అజిత్ (Twitter/Photo)

అభిమాని ఫోన్ లాక్కొన్న అజిత్ (Twitter/Photo)

Thala Ajith: ఒక్కోసారి మన హీరోలు అభిమానులు చేసే పనుల కారణంగా వీళ్లు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి సన్నివేశమే అజిత్ విషయంలో జరిగింది.

    Thala Ajith: ఒక్కోసారి మన హీరోలు అభిమానులు చేసే పనుల కారణంగా వీళ్లు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి సన్నివేశమే జరిగింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇవాళ ఒకే దశలో పూర్తిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో  ఓటు వేయడానికి సామాన్యులతో సెలబ్రిటీలు పోటెత్తారు. ఈక్రమంలో హీరో అజిత్ తన ఇంటికి సమీపంలోని పోలింగ్ కేంద్రానికి తన భార్యతో కలిసి ఓటు వేయడానికి వచ్చాడు.ఈ క్రమంలో మాస్క్ లేని ఓ అభిమాని అతనితో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో హీరో అజిత్‌కు ఆ ఫ్యాన్ పై ఎక్కడ లేని కోపం అతని చేతిలోని ఫోన్‌ను లాక్కొన్నాడు.


    ఆ తర్వాత భార్య శాలినీతో కలిసి ఓటు వేసిన వచ్చిన తర్వాత సదరు అభిమానికి అతని ఫోన్ తిరిగి ఇవ్వడంతో పాటు సారీ అంటూ క్షమాపణలు చెప్పాడు. ఏమైనా అభిమానులు కూడా హీరోలు కనబడగానే ఇలాంటి పనులు చేయడం కూడా కరెక్ట్ కాదంటున్నారు ఇంకొంత మంది. మొత్తంగా తమిళనాడు ఎన్నికల్లో ఇపుడు అజిత్ .. అభిమాని ఫోన్ లాక్కొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక  తమిళనాడు అసెంబ్లీ  ఎన్నికల్లో అజిత్‌తో పాటు రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విజయ్  వంటి సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ajith, Kollywood, Tamil Nadu Assembly Elections 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు