• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KOLLYWOOD STAR COMEDIAN VIVEK HEALTH BULLITEN RELEASED STILL HIS HEALTH CONDITION VERY CRITICAL TA

Actor Vivek health bulliten: తమిళ స్టార్ కమెడియన్ వివేక్‌ హెల్త్ బులిటెన్ విడుదల.. అత్యంత విషమంగా ఆరోగ్యం..

Actor Vivek health bulliten: తమిళ స్టార్ కమెడియన్ వివేక్‌ హెల్త్ బులిటెన్ విడుదల.. అత్యంత విషమంగా ఆరోగ్యం..

వివేక్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల (Twitter/Photo)

Actor Vivek health bulliten | 2020 టాలీవుడ్ సహా ఏ సినీ ఇండస్ట్రీకి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. తాజాగా తమిళ స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరారు. తాజాగా ఈయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ సిమ్ హాస్పిటల్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

  • Share this:
    Actor Vivek health bulliten | 2020 టాలీవుడ్ సహా ఏ సినీ ఇండస్ట్రీకి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. కరోనాతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా కన్నుమూసారు. 2021లో కూడా సినీ ఇండస్ట్రీలో వరుస విషాద ఛాయలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కోలీవుడ్‌లో స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో చేర్పించారు.  ప్రస్తుతం వివేక్ పరిస్థితి అంతగా బాగాలేదని డాక్టర్లు చెప్పారు. తాజాగా ఈయన ఆరోగ్య పరిస్థితిపై చెన్నైలోని సిమ్ ఆసుపత్రి సిబ్బంది  హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. వివేక్ ఈ రోజు ఉదయం 11.00 గంటలకు  హాస్పిటల్‌కు స్రృహ లేని స్థితిలో వచ్చినట్టు తెలిపారు. డాక్టర్లు ఆయనకు వెంటనే వైద్య సహాయం చేసారు. ఆయనకు యాంజియోగ్రామ్‌తో పాటు యాంజియో ప్లాస్ట్ చికిత్స అందించినట్టు తెలిపారు. ప్రస్తుతం వివేక్‌ను ఐసీయూలో ఎక్మో పై  ఉంచి చికిత్స  అందిస్తున్నట్టు డాక్టర్లు తెలిపారు. ఇంకో 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని డాక్టర్లు తెలియజేసారు.

    వివేక్‌కు గుండెపోటుకు రావడంపై తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.  తమిళనాట వడివేలు, సెంథిల్,గౌండ్రమణి  తర్వాత అంతటి ఇమేజ్, క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఈయనే. ఇప్పటికే తమిళంలో దాదాపు 240 సినిమాలకు పైగానే నటించాడు వివేక్. 12 ఏళ్ల కింద అంటే 2009లోనే ఈయనకు కేంద్రం ప‌ద్మ‌ శ్రీ అవార్డ్‌తో సత్కరించింది. తమిళ నటుడు అయినా కూడా వివేక్ తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

    వివేక్ హెల్త్ బులెటిన్ విడుదల (Twitter/Photo)


    ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన  అపరిచితుడు, శివాజీ లాంటి సినిమాల్లో వివేక్ నటనకు తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. తమిళంలో అయితే ఈయన టాప్ కమెడియన్. ఒకానొక సమయంలో వివేక్ లేని తమిళ సినిమా విడుదలయ్యేది కాదంటే అతిశయోక్తి కాదేమో..? కొన్నేళ్ల కింద వివేక్ తల్లి, కొడుకు ప్రసన్న కుమార్ చనిపోయారు. వాళ్ల మరణం తర్వాత బాగా కుంగిపోయాడు వివేక్. అప్పట్నుంచి ఆయన ఆరోగ్యం కాస్త లయ తప్పిందంటారు సన్నిహితులు. అయితే సినిమాలు చేయడంతోనే ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారు. మునపటిలా ఇప్పుడు సినిమాలు కూడా చేయడం లేదు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వివేక్ ప్ర‌జ‌ల‌కు క‌రోనా జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం కూడా చేసాడు. కానీ వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని గంటల్లోనే ఈయనకు హార్ట్ ఎటాక్ రావడంతో అంతా షాక్ అవుతున్నారు. ప్ర‌స్తుతం వివేక్ ఆరోగ్య ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈయన కోలుకోవాలని అభిమానులు దేవున్ని ప్రార్థిస్తున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు