హోమ్ /వార్తలు /సినిమా /

త్వరలో పెళ్లి పీఠలెక్కనున్న విశాల్..పెళ్లికూతురు ఎవరో తెలుసా..

కోలీవుడ్ యాక్షన్ హీరో కమ్ తమిళ నిర్మాతల సంఘం అధ్యక్షుడు విశాల్ త్వరలో ఒకింటి వాడు కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

  ఇన్నాళ్లు పెళ్లి గురించి అడిగితే నడిగర్ సంఘం భవనం నిర్మించిన తర్వాతే చేసుకుంటానన్న విశాల్..అనుకున్నట్టే ఈ భవన నిర్మాణ దశలోనే ఉండగానే మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

  పెళ్లి విషయాన్ని విశాల్ తండ్రి ..ప్రముఖ నిర్మాత జీ.కే.రెడ్డి ప్రకటించినట్టు చెన్నై మీడియా వర్గాలు చెబుతున్నాయి. అందరు అనుకున్నట్టుగా విశాల్ వివాహం శరత్ కుమార్ ముద్దుల తనయ వరలక్ష్మితో కాకుండా అనీషా  అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.

  త్వరలో వీళ్లిద్దరి నిశ్చితార్థం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరగనున్నట్టు చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నెటిజన్లు అనీషా ఎవరో అని తెగ వెతకడం మొదలు పెట్టారు. మొత్తానికి కొత్త యేడాదిలో విశాల్ ఒకింటివాడు కావడం చూసి ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

  ఇది కూడా చదవండి 

  #HBD:పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి

  #FlashBack2018: ఈ ఏడాది టాప్ హీరోయిన్లు వీళ్లే..

  #FlashBack2018: బాక్సాఫీస్‌‌ డుమ్మా కొట్టిన హీరోలు

  First published:

  Tags: Kollywood, Vishal

  ఉత్తమ కథలు