KOLLYWOOD HERO VIJAY BEAST MOVIE 6 DAYS WORLD WIDE COLLECTIONS TA
Beast 6 Days WW Collections : విజయ్ ‘బీస్ట్’ 6 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. కేజీఎఫ్ 2 జోరు ముందు బేజారు..
బీస్ట్ 6 డేస్ కలెక్షన్స్ (Beast OTT Release Date Photo : Twitter)
Vijay - Beast 5 Days World Wide Collections | తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా తెలుగు మార్కెట్ పై పట్టు సాధిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో ఎంత రాబట్టిందంటే..
Vijay - Beast 5 Days World Wide Collections | తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) గత కొన్నేళ్లుగా తెలుగు మార్కెట్ పై పట్టు సాధిస్తున్నారు. ఇక్కడ వరుస విజయాలతో దూకుడు మీదున్నారు. గతేడాది ‘మాస్టర్’ (Master) మూవీతో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న ఈయన.. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ‘బీస్ట్’ అనే మూవీ చేసారు. ఈ నెల 13న విడుదలైన ’బీస్ట్’ సినిమా బ్యాడ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో విజయ్ సరసన మొదటి సారి పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఈ సినిమా ఈ సినిమాలో విజయ్ ఇండియన్ స్పై వీర రాఘవ అనే ఏజెంట్‌గా కనిపించి కేక పెట్టించారు. ఈ సినిమా మొదటి రోజు మంచి వసూళ్లనే రాబట్టింది.
ఇక స్పై యాక్షన్-థ్రిల్లర్‌గా వచ్చిన బీస్ట్ విషయానికి వస్తే.. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ భారీగా నిర్మించింది. పూజాహెగ్డే హీరోయిన్‌గా చేశారు. చెన్నైలో కొందరు అభిమానులు ఏకంగా సినిమా బాగాలేదని థియేటర్‌ను తగలబెట్టారు. ఈ సినిమా రూ. 10.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమాకు పోటీగా వచ్చిన కేజీఎఫ్ 2 దూకుడు ముందు ఈ సినిమా తేలిపోయింది. ఈ సినిమా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 6.98 కోట్ల షేర్ ( రూ. 12.48 కోట్లు గ్రాస్) వసూళ్లను సాధించింది. తెలుగులో ఈ సినిమా రూ. 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 3.48 కోట్ల వసూళ్లను రాబట్టాలి.
ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదలపై అప్పుడే సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ OTT హక్కులు SunNxt, ఇంకా Netflix వద్ద ఉన్నాయి. సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత మాత్రమే OTTలో విడుదల చేయాలనేది ఒప్పందం. అయితే బీస్ట్ అనుకున్నంతగా ఆకట్టుకోవడం లేదు. దీంతో ముందే రావోచ్చని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.