తన నటనా ప్రతిభతో నాచురల్ స్టార్ అనిపించుకుని తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు నాని (Nani). మీడియం రేంజ్ హీరోగా ఎన్నో హిట్ సినిమాలు చేసిన ఆయన.. ఇప్పుడు దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాని కెరీర్ లోనే ఓ డిఫరెంట్ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మార్చి 30న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
నాని కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమా ఈ దసరా. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ జోరుగా నడిపిస్తున్నారు నాని. దేశం మొత్తం పర్యటిస్తూ తన దసరా సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా నాని హవానే కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నానిపై కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
. @NameisNani, you are everywhere, and it’s amazing to see your energy. More power to #Dasara ????????????
— Karthi (@Karthi_Offl) March 28, 2023
నాని.. ఇప్పుడు ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. నిన్ను ఇలా ఎనర్జిటిక్ గా చూడడం ఎంతో ఆనందంగా ఉంది. నీకు మరింత పవర్ తోడవ్వాలని కోరుకుంటున్నా అని పేర్కొంటూ కార్తీ ట్వీట్ చేశారు. దీంతో ఈ మెసేజ్ వైరల్ గామారింది. ఇది చూసి కార్తీ అభిమానులు, నాని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రయోగాత్మక పాత్ర పోషిస్తున్నారు నాని. ధరణిగా నాని కనిపించనుండగా.. వెన్నెలగా కీర్తి సురేష్ ఓ డిఫరెంట్ రోల్ లో కనిపించనుంది. ఈ రెండు పాత్రలు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయంటూ చిత్ర యూనిట్ చెబుతోంది.
తెలంగాణ లోని గోదావరిఖని సమీపంలో ఉన్న సింగరేణి ప్రాంతానికి చెందిన ఫిక్షనల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ దసరా మూవీ రిలీజ్ కానుండటం విశేషం. ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు చాలా కట్స్ చెప్పడం విశేషం. సినిమా మొత్తం కలిపి 16 సీన్స్‌పై కట్స్ చెప్పింది సెన్సార్ బృందం. ఆడియో మ్యూట్, డైలాగ్స్ కట్స్ అన్నీ కలిపి చూసుకుంటే మొత్తం 36 చోట్ల కట్స్ చెప్పారట. ఇంత మొత్తంలో కట్స్ పెట్టిన ఈ చిత్రం ఈ విధంగా కూడా రికార్డు సృష్టించిందని చెప్పుకుంటున్నారు కొందరు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dasara Movie, Hero nani, Tollywood