హోమ్ /వార్తలు /సినిమా /

Kamal Haasan - Gautami: గౌతమిని వదిలేసిన కమల్ హాసన్.. మరో హీరోయిన్‌తో సై అంటున్న లోకనాయకుడు..

Kamal Haasan - Gautami: గౌతమిని వదిలేసిన కమల్ హాసన్.. మరో హీరోయిన్‌తో సై అంటున్న లోకనాయకుడు..

కమల్ హాసన్ గౌతమి (Kamal Haasan Gautami)

కమల్ హాసన్ గౌతమి (Kamal Haasan Gautami)

Kamal Haasan - Gautami: అదేంటి.. గౌతమిని కమల్ హాసన్ (Kamal Haasan - Gautami) ఎప్పుడో వదిలేసాడు కదా.. ఇప్పుడు కొత్తగా వదిలేయడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నిజమే.. కానీ ఇప్పుడు మరోసారి ఆమె లేకుండానే ముందుకు వెళ్తున్నాడు కమల్ హాసన్.

ఇంకా చదవండి ...

అదేంటి.. గౌతమిని కమల్ హాసన్ ఎప్పుడో వదిలేసాడు కదా.. ఇప్పుడు కొత్తగా వదిలేయడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నిజమే.. కానీ ఇప్పుడు మరోసారి ఆమె లేకుండానే ముందుకు వెళ్తున్నాడు కమల్ హాసన్. ఈయన ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకు ఈయన రాజకీయాలు చేసాడు. కానీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో ఆయన డీలా పడిపోతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం సినిమాలపైనే ఫోకస్ చేసాడు. పూర్తిగా అక్కడ బిజీ అవుతున్నాడు. అలా దారుణ పరాభవాన్ని మరిచిపోవచ్చు అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే వరస సినిమాలకు ఓకే చెప్తున్నాడు కమల్ హాసన్. ఇప్పటికే ఈయన భారతీయుడు 2 సినిమాలో నటిస్తున్నాడు. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సగం పూర్తైంది. అయితే అనివార్య కారణాలతో ఈ చిత్ర షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో చెప్పడం కూడా కష్టమే.

అందుకే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమాకు కమిటయ్యాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైంది. ముఖ్యంగా ఇందులో కమల్ హాసన్ యాక్షన్ సీక్వెన్సులు అదరగొట్టబోతున్నట్లు తెలుస్తుంది. దీనికోసం అంబు అరవి యాక్షన్ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు.

Kamal Haasan,Kamal Haasan twitter,Kamal Haasan instagram,Kamal Haasan movies,Kamal Haasan drishyam 2 movie remake tamil,Kamal Haasan Gautami,Kamal Haasan gautami papanasham movie,Kamal Haasan gautami drishyam 2 movie,Kamal Haasan meena in drishyam 2 movie,telugu cinema,కమల్ హాసన్,కమల్ హాసన్ గౌతమి,కమల్ హాసన్ గౌతమి దృశ్యం 2 రీమేక్,కమల్ హాసన్‌తో మీనా దృశ్యం 2 రీమేక్
కమల్ హాసన్ గౌతమి (Kamal Haasan Gautami)

ఈ సినిమా షూటింగ్ కరోనా సమయంలోనూ జాగ్రత్తల మధ్య జరుగుతుంది. ఈ చిత్రం తర్వాత దృశ్యం 2 సినిమాను కూడా తమిళంలో రీమేక్ చేయాలని చూస్తున్నాడు కమల్. దృశ్యం తమిళ రీమేక్ పాపనాశంలో కమల్ నటించాడు. అయితే అప్పుడు ఆయనకు జోడీగా గౌతమి నటించింది.

Kamal Haasan,Kamal Haasan twitter,Kamal Haasan instagram,Kamal Haasan movies,Kamal Haasan drishyam 2 movie remake tamil,Kamal Haasan Gautami,Kamal Haasan gautami papanasham movie,Kamal Haasan gautami drishyam 2 movie,Kamal Haasan meena in drishyam 2 movie,telugu cinema,కమల్ హాసన్,కమల్ హాసన్ గౌతమి,కమల్ హాసన్ గౌతమి దృశ్యం 2 రీమేక్,కమల్ హాసన్‌తో మీనా దృశ్యం 2 రీమేక్
కమల్ హాసన్ మీనా (Kamal Haasan meena)

తమిళంలో ఒరిజినల్ తెరకెక్కించిన జీతూ జోసెఫ్ తెరకెక్కించాడు. పాపనాశం మంచి విజయం సాధించింది. ఇప్పుడు దృశ్యం 2 వచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా వచ్చేస్తుంది. ఇదే సినిమాను అక్కడ కమల్ రీమేక్ చేయాలనుకుంటున్నాడు. కానీ గౌతమి కాకుండా ఒరిజినల్‌లో నటించిన మీనాతోనే నటించాలని చూస్తున్నాడు లోక నాయకుడు. త్వరలోనే ఈ చిత్రంపై పూర్తి క్లారిటీ రానుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Kamal haasan, Kollywood, Tamil Cinema

ఉత్తమ కథలు