హోమ్ /వార్తలు /సినిమా /

Kamal Haasan Vikram release date: కమల్ హాసన్ మోస్ట్ అవైటెడ్ ‘విక్రమ్’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్..

Kamal Haasan Vikram release date: కమల్ హాసన్ మోస్ట్ అవైటెడ్ ‘విక్రమ్’ రిలీజ్ డేట్ కన్ఫర్మ్..

Kamal Haasan Vikram release date: లోకనాయకుడు కమల్ హాసన్‌కు (Kamal Haasan) తెలుగులోనూ అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. అయితే కొన్నేళ్లుగా ఆయన సినిమాలు ఇక్కడ విజయం సాధించడం లేదు. రాజకీయాలపై కూడా ఫోకస్ చేయడంతో కథల గురించి పెద్దగా ఆలోచించడం లేదు ఈయన.

ఇంకా చదవండి ...

లోకనాయకుడు కమల్ హాసన్‌ (Kamal Haasan) కు తెలుగులోనూ అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. అయితే కొన్నేళ్లుగా ఆయన సినిమాలు ఇక్కడ విజయం సాధించడం లేదు. రాజకీయాలపై కూడా ఫోకస్ చేయడంతో కథల గురించి పెద్దగా ఆలోచించడం లేదు ఈయన. అందుకే కమల్ నుంచి వచ్చిన సినిమాలేవీ గత 15 ఏళ్లలో తెలుగులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. దశావతారం (Dasavatharam) తర్వాత కమల్ (Kamal Haasan) నుంచి అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా రాలేదు. విశ్వరూపం (Vishwaroopam) హిట్టైనా.. అది చాలా మందికి రీచ్ కాలేదు. ఇలాంటి సమయంలో ఈయన నటిస్తున్న విక్రమ్ ( Vikram release date) సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి కారణం దర్శకుడు లోకేష్ కనకరాజ్ కావడమే. ఖైదీ, మాస్టర్ లాంటి సంచలన విజయాల తర్వాత ఈ దర్శకుడి నుంచి వస్తున్న సినిమా ఇది. దానికితోడు కమల్ హాసన్‌ను చాలా కొత్తగా చూపిస్తున్నాడు లోకేష్ (Lokesh kanagaraj).

ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం కమల్ అభిమానులు కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. నిజానికి గత 20 సంవత్సరాలుగా కమల్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ సినిమా లేదు. ఒకప్పుడు ఆయన సినిమాలు కమర్షియల్‌‌గా సంచలన విజయం సాధించాయి. దాంతో పాటు అవార్డుల పరంగానూ ఎన్నో రికార్డులు అందుకున్నాయి. కొన్నేళ్లుగా కమల్ హాసన్ సినిమాలు కమర్షియల్ విజయాలకు దూరంగా నిలిచిపోయాయి. అయినా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు లోక నాయకుడు. ఈయనతో భారీ బడ్జెట్ సినిమాలు చేసినప్పుడు నిర్మాతలకు నష్టాలు తప్పట్లేదు. ఇంత జరిగినా కూడా సినిమాకు దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు కమల్ హాసన్.

అలాగే దాదాపు 50 కోట్ల అప్పులు ఉన్నాయని ఈ మధ్యే తన అఫిడవిట్‌లో చూపించాడు కమల్ హాసన్. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న విక్రమ్ సినిమా షూటింగ్ పూర్తైపోయింది. పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది ఈ చిత్రం. ఈ సినిమాకు నిర్మాత కూడా కమల్ హాసనే. దీని బడ్జెట్ దాదాపు 70 కోట్లు. ఇందులో నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటులు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 3న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు కమల్ హాసన్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి బిజినెస్ జరుగుతుంది. కొన్నేళ్లుగా కమల్ సినిమాను ఇక్కడ 4 కోట్లకు కూడా ఎవరూ కొనడం లేదు.. కానీ విక్రమ్ మాత్రం 10 కోట్లకు పైగానే బిజినెస్ చేస్తుంది. దానికి కారణం లోకేష్ కనకరాజ్ సినిమాల ట్రాక్ రికార్డే. మరి చూడాలిక.. ఈ సినిమాతో కమల్ ఏం చేస్తాడో..?

First published:

Tags: Kamal haasan, Lokesh Kanagaraj, Tamil Cinema, Vikram Movie

ఉత్తమ కథలు