నయనతార ప్రవర్తనపై తమిళ తంబీల ఆగ్రహం..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌  ఎవరంటే అందరు ఠక్కున చెప్పే పేరు నయనతార. తాజాగా ఆమె చేసిన పనికి కొంత మంది దర్శక,నిర్మాతలు నయనతార తీరును ఎండగడుతున్నారు.

news18-telugu
Updated: January 16, 2020, 3:25 PM IST
నయనతార ప్రవర్తనపై తమిళ తంబీల ఆగ్రహం..
నయనతార (Twitter/Nayanthara)
  • Share this:
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌  ఎవరంటే అందరు ఠక్కున చెప్పే పేరు నయనతార. ఆమె ఎన్ని సినిమాల్లో నటించినా వాటి ప్రమోషన్స్ కి మాత్రం దూరంగా ఉంటుంది. చివరకు రజినీకాంత్ లాంటి స్టార్ హీరో నటించిన ‘దర్బార్’ సినిమాకు ప్రమోషన్స్‌కు అటెండ్ కాలేదు. నయనతార ఒక సినిమా ఒప్పుకున్నపుడే ప్రమోషన్స్‌కు రానని నిర్మాతలతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఇక ఎప్పుడూ తను యాక్ట్ చేసిన  సినిమాల గురించి బయట ఒక్క మాట కూడా మాట్లాడి ప్రమోట్ చేయని ఏకైక హీరోయిన్‌గా నయనతార వార్తల్లో నిలిచింది. అయితే ఆమెపై సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నా..నయనతార డోంట్ కేర్ అంటూ తన పని తాను చేసుకుపోతూనే ఉంది.   ఎవరెన్ని విమర్శలు చేసినా, తనపై ఏ వివాదం జరిగినా నయన్ మాత్రం బయటకి రాదు ఆ ఇష్యూ ఎంత పెద్దదైనా ఒక్క మాట కూడా మాట్లాడదు. సోషల్ మీడియాలో కూడా కనిపించని నయనతారని సినిమాల్లో మాత్రమే చూడాలనేంత ప్రైవసీ మైంటైన్ చేస్తుంది నయన్. అయితే ఇటీవల ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన అవార్డు వేడుకలో నయనతార పాల్గొనడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డులు తీసుకోవడానికి వస్తావు కానీ ప్రమోషన్స్ కు రావా అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోలివుడ్ దర్శక నిర్మాతలు.

Tollywood industry afraid of Lady Superstar Nayanthara and here the main reasons behind pk నయనతారను చూస్తుంటే ఎందుకు భయం.. ఆమె లాంటి నటి సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎవరూ లేరు కదా.. అలాంటి నటిని ఎప్పుడెప్పుడు తమ సినిమాల్లో తీసుకోవాలా అని ఎదురు చూస్తుంటారు దర్శకులు.. nayanthara,nayanthara twitter,nayanthara tollywood,nayanthara sye raa,nayanthara no promotion,nayanthara movies,nayanthara chiranjeevi,nayanthara hot images,nayanthara remuneration,nayanthara,nayanthara shocking remuneration,nayanthara movies,nayanthara demands shocking remuneration,nayanthara remunration,nayanthara remunration news,nayanthara shocking remunration,nayanatara remuneration,nayanthara remuneration for syeraa,nayantara remuneration,nayanatara shocking remuneration,nayantara,nayanthara remuneration syeraa,nayanthara love affairs,nayanthara gossips,remuneration,samantha remuneration,telugu cinema,నయనతార,నయనతార సినిమాలు,నయనతార చిరంజీవి,నయనతారపై కోపం,నయనతార అంటే తెలుగు ఇండస్ట్రీకి భయం,తెలుగు సినిమా
సైరాలో నయనతార


ఏదైనా సినిమా అవార్డులకు మాత్రమే కాదు..  సినిమాను నిలబెట్టే ప్రమోషన్స్‌లో నయనతార పాల్గొంటే బాగుంటుందన్నారు. ఇకనైనా నయన్ తన పద్ధతి మార్చుకుంటే మంచిదని మాట్లాడుకుంటున్నారు కొంతమంది దర్శక నిర్మాతలు. అయితే గతంలో ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి ఎవరికీ పెద్దగా తెలియడం  ఇష్టం లేదని చెప్పింది నయన్ . ఇది మాత్రమే కాకుండా తన మాటలని మీడియా చాలా సార్లు తప్పుగా ప్రచారం చేసిందన్నారు. తన మాటల వెనుక ఉన్న ఇంటెన్షన్ ని మార్చి చూపించారని అందుకే తాను మీడియాకి దూరంగా ఉంటానని చెప్పింది. తను ఒక నటిని మాత్రమే అని, తన సినిమాలే మాత్రమే మాట్లాడుతాయని నయన్ తెలిపింది. మొత్తానికి తనమీద వస్తున్న విమర్శలకు నయన్ ఎలా సమాధానం చెబుతుందో వేచి చూడాల్సిందే.
First published: January 16, 2020, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading