• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • KOLLYWOOD FAMOUS DIRECTOR SUSEENTHIRAN SEVERLY INJURED TA

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రముఖ సినీ దర్శకుడు..

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రముఖ సినీ దర్శకుడు..

సుశీంద్రన్ (Facebook/Photo)

ప్రముఖ తమిళ దర్శకుడు సుశీంద్రన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేయికి గాయమైంది.

  • Share this:
    ప్రముఖ తమిళ దర్శకుడు సుశీంద్రన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేయికి గాయమైంది. ఈయన తమిళంలో విశాల్, కార్తిలతో పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈ శుక్రవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తోన్న సమంలో సుశీంద్రన్‌ను వెనక నుంచి బైక్‌లో వచ్చిన ఒకతను సుశీంద్రన్ ఢీ కొట్టి వెళ్లిపోయాడు. ఆ దెబ్బకు అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు సుశీంద్రన్. తీవ్ర గాయాలతో కింద పడ్డ సుశీంద్రన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వెంటనే ఆయనకు మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం సుశీంద్రన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందట. గతేడాది ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘కెనడీ క్లబ్, చాంపియన్ సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. ఆయన గాయపడటంతో కోలీవుడ్ దర్శకులు, నటీనటులు ఆయన్ని పరామర్శిస్తున్నారు. అంతేకాదు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు