Comedian Ilambarathi: సినిమా అవకాశాలు లేవు.. జీవనం కష్టంగా ఉంది ఆదుకోండంటూ నటుడు ఆవేదన?

Comedian Ilambarathi

Comedian Ilambarathi: గత రెండు సంవత్సరాల కాలం పాటు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటికీ అతలాకుతలం చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో పరిశ్రమలపై కరోనా కోలుకోలేని దెబ్బ కొట్టినదని చెప్పవచ్చు

  • Share this:
    Comedian Ilambarathi: గత రెండు సంవత్సరాల కాలం పాటు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటికీ అతలాకుతలం చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో పరిశ్రమలపై కరోనా కోలుకోలేని దెబ్బ కొట్టినదని చెప్పవచ్చు. ఈ కరోనా ధాటికి చాలా మంది నిరుద్యోగులుగా మారిపోయారు. ఉన్న ఉద్యోగం ఓడిపోవడమేకాకుండా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో చాలామంది బతుకులు రోడ్డున పడ్డాయి. ఈ క్రమంలోనే కరోనా ప్రభావం వల్ల పూట గడవడం కూడా చాలామందికి కష్టంగా మారిపోయింది.

    కరోనా ప్రభావం కారణంగా చిత్ర పరిశ్రమ పై అధిక ప్రభావం చూపిందని చెప్పవచ్చు. కరోనా వల్ల చిత్ర పరిశ్రమ మూతపడటం చేత ఈ పరిశ్రమపై ఆధారపడి బతికే లక్షల కుటుంబాలు బతుకులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ విధంగా చిత్ర పరిశ్రమకు చెందిన హాస్యనటుడు కరోనా కారణం చేత తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించాలని నటుడు ఇళంభారతి బుధవారం కలెక్టర్‌ ఆల్బీజాన్‌వర్గీష్‌కు వినతి పత్రం సమర్పించారు.

    ఆవడి సమీపంలోని పాండేశ్వరం గ్రామానికి చెందిన ఇళంభారతి పలు సినీ ప్రముఖులతో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు.అయితే ప్రస్తుతం కరోనా కారణం చేత కేవలం కొంత మంది సమక్షంలో మాత్రమే సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తనకు సినిమాల్లో కానీ, సీరియల్లో కానీ అవకాశాలు రాకపోవడంతో ఎన్నో ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు.

    ఈ క్రమంలోనే కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్‌ ఇళంభారతి వినతిపత్రాన్ని స్వీకరిస్తూ త్వరలోనే తనకు ఏదైనా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విధంగా చిత్ర పరిశ్రమను నమ్ముకుని ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు చాలామంది ఉన్నారు.రోజు వారి కూలీ పరంగా పనిచేసే ఎంతో మంది కార్మికులు ఈ కరోనా కారణం చేత ఇబ్బందులు పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు సినీ పెద్దలు కార్మికులకు తమదైన శైలిలో సహాయం చేస్తూ సినీ కార్మికులను ఆదుకున్నారు.
    Published by:Navya Reddy
    First published: