Home /News /movies /

సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై కేంద్రంపై ఫైర్ అవుతున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు..

సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై కేంద్రంపై ఫైర్ అవుతున్న కోలీవుడ్ సినీ ప్రముఖులు..

కొత్త సినిమాటోగ్రఫీ చట్టంపై కోలీవుడ్ ప్రముఖుల ఫైర్ (File/Photos)

కొత్త సినిమాటోగ్రఫీ చట్టంపై కోలీవుడ్ ప్రముఖుల ఫైర్ (File/Photos)

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన  సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై కోలీవుడ్, బాలీవుడ్ సహా పలువరు ప్రముఖులు మండిపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన  సినిమాటోగ్రఫీ చట్ట సవరణపై కోలీవుడ్, బాలీవుడ్ సహా పలువరు ప్రముఖులు మండిపడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్ట సవరణ సినిమావాళ్ల భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సినిమాటోగ్రఫీ చట్టంపై కోలీవుడ్ ప్రముఖులు కమల్ హాసన్, సూర్య, విశాల్ సహా అందరు మండిపడుతున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా నిరసన తెలుపుతున్నారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇది సినిమావాళ్ల భావ ప్రకటనను గొంతు నొక్కడమే అంటూ తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం జూన్ 18వ తేదిన సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు ప్రతిపాదించింది. 1952 నాటి ఈ చట్టానికి మార్పులు చేసి గతేడాది ఫిబ్రవరి 12న రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లు.. ఆ తర్వాత లోక్‌సభ ఆమోదించింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా రూపొందింది.

ఈ కొత్త చట్టం ప్రకారం .. ఒక సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డ్ సెన్సార్ చేసి సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాత ఎవరైనా ఈ సినిమాపై ఫిర్యాదు చేస్తే.. కేంద్రం మళ్లీ సెన్సార్ చేయమని  కోరవచ్చు. దీంతో ఇప్పటి వరకు స్వతంత్య్ర వ్యవస్థగా ఉన్న సెన్సార్ బోర్డ్ పై ఇది కేంద్ర ప్రభుత్వం పెత్తనం పెరుగుతోందనే ఆరోపణలున్నాయి.  అంతేకాదు ఒక సినిమాలోని సన్నివేశాలు లేదా స్టోరీని కాపీ కొట్టినట్టు తేలితే.. జైలు శిక్షతో పాటు అపరాధం విధించవచ్చు. ఇలాంటి నిబంధనలు ఈ కొత్త చట్టంతో అమల్లోకి వచ్చాయి.

మారిన సెన్సార్ బోర్డ్ రూల్స్ (Censor Board)
మారిన సెన్సార్ బోర్డ్ రూల్స్ (Censor Board)


మరోవైపు ఈ చట్టంపై బాలీవుడ్‌కు చెందిన అనురాగ్ కశ్యప్, ఫర్హాన్ అఖ్తర్, నందితా దాస్, ప్రకాష్ రాజ్, తమిళ డైరెక్టర్ వెట్రిమారన్‌ సహా 1400 మంది ఈ చట్టంపై తమ నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రానికి ఘాటు లేఖ రాశారు. ఒక చిత్రానికి సెన్సార్ చేసిన తర్వాత మళ్లీ సెన్సార్ చేయాలనే ఆదేశించే అధికారం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండటం అనేది వాక్ స్వాతంత్య్రాన్ని హరించేదిగా ఉందన్నారు. దీనిపై కమల్ హాసన్, కార్తీ, సూర్య, విశాల్, ఆమీర్ ఖాన్, ప్రకాష్ రాజ్ వంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐతే.. ఈ కొత్త చట్టంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ  స్పందించింది.

universal hero kamal haasan supports pm narendra modi due to china president xi jinping,xi jinping,pm modi,narendra modi,kamal haasan,kamal haasan pm narendra modi,kamal haasan praises pm narendra modi,pm modi meets xi jinping,chinese president xi jinping,xi jinping modi,pm modi and xi jinping,pm modi in china,modi,xi jinping,president xi jinping welcomes pm modi,xi jinping pm modi,modi xi jinping summit,modi meets xi jinping,modi-xi jinping meeting,india pm meets xi jinping,modi with china president xi jinping,pm modi-xi jinping,modi in china,suriya shruti haasan 7th sense,7th sense,మామల్లపురం,జిన్ పింగ్,ప్రధాని మోదీ,తమిళనాడు,భేటీ,మహాబలిపురం,7th సెన్స్,శృతి హాసన్,సూర్య ఏ ఆర్ మురుగదాస్,టాలీవుడ్,కోలీవుడ్,తమిళ సినిమా,ప్రధాన మంత్రికి కమల్ హాసన్ బాసట,కమల్ హాసన్,ప్రధాన మంత్రికి మద్దతు పలికిన కమల్ హాసన్,
కమల్ హాసన్, పీఎం మోదీ (File photo)


ఈ కొత్త చట్టంతో దొంగతనంగా సినిమాలు రిలీజ్ చేయకుండా అడ్డుకోవచ్చన్నారు. పైరసీ చేసినవాళ్లను చట్టం ప్రకారం శిక్షించవచ్చని చెప్పుకొచ్చారు.  సెంట్రల్ గవర్నమెంట్‌కు, సినీ పరిశ్రమకు ఏర్పడే భారీ లాస్‌ను దీంతో భర్తీ చేసుకొని గాడిలో పెట్టవచ్చన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన్ననలు అందుకుంటున్న భారత దేశంలో .. వాక్ స్వాతంత్రపు హక్కు హరించేలా ఈ చట్టం ఉందంటున్నారు. పైగా ఈ సవరణలు కోర్టు తీర్పులకు వ్యతిరేకం అన్నారు. అందువల్ల వెంటనే ఈ చట్టాన్ని వీలైనంత తొందరలోనే ఉపసంహరించుకోవాలని  సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మరి కొంత మంది సినీ ప్రముఖులు మాత్రం కేంద్రం తీసుకొచ్చిన సినిమాటోగ్రఫీ చట్టం నిర్మాతలు, హీరోలు, చిత్ర పరిశ్రమను ఆదుకునేలా ఉందని కితాబు ఇస్తున్నారు. మొత్తంగా కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్ట సవరణపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bollywood news, Central Government, Kollywood

తదుపరి వార్తలు