హోమ్ /వార్తలు /సినిమా /

యువ సినీ నటి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ చూసి షాకైన బంధువులు!

యువ సినీ నటి ఆత్మహత్య.. సూసైడ్ నోట్ చూసి షాకైన బంధువులు!

Deepa Photo Twitter

Deepa Photo Twitter

Deepa Suicide: యువ సినీ నటి దీప ఆత్మహత్యకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె సూసైడ్ నోట్ లో రాసి ఉన్న విషయాలపై చర్చలు నడుస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

చిత్ర సీమలో విషాదం నెలకొంది. యువ తమిళ సినీ నటి దీప (Deepa) అలియస్ పౌలిన్ జెస్సికా ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఒకరిని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటానంటూ సూసైడ్ నోట్ రాసి ఆమె తనువూ చాలించింది. దీంతో దీప ఆత్మహత్యకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చెన్నైలోని విరుగంబాక్కంలో నివసిస్తున్న దీప.. తన గదిలోనే ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే గదిలో లభించిన సూసైడ్ నోట్ చూసి ప్రేమ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు.

తమిళ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ చక్కదిద్దుకుంటున్న దీప.. ఓ వ్యక్తిని ప్రేమించి మోసపోయినట్లు తెలుస్తోంది. కొన్ని అనివార్య కారణాల వల్ల లవ్ లైఫ్‌లో సమస్యలు రావడంతో వాటిని అధిగమించలేకనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు దీపతో మాట్లాడాలని ఆమె మొబైల్ కి పలుమార్లు కాల్ చేయగా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి దీప ఫ్రెండ్ ప్రభాకరన్ కి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లి చూసే సరికి దీప ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది.

అయితే ఆ ప్రదేశంలో సూసైడ్ నోట్ లభించడంతో దీప మరణానికి ప్రేమనే కారణం అని తెలుసుకున్నారు. తన ఆత్మ హత్యకు ఎవరు కారణం కాదని ఆ నోట్‌లో రాసి పెట్టింది దీప. ప్రస్తుతం ఆమె మృత దేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ నోట్ లో జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటానని రాసిన దీప.. అతడి పేరును మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఆమెకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరెవరు? ఎవరితో దీప క్లోజ్ గా ఉండేది అనే విషయాలు ఆరా దీస్తూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. దీప ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.

కోలీవుడ్‌లో అనేక సినిమాల్లో దీప నటించింది. చిన్న చిన్న రోల్స్ చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది. మిస్కిన్ దర్శకత్వం వహించిన ‘తూప్పరివాలన్’ (Thupparivalan)లో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ మధ్యనే విడుదలైన ‘వైధా’ (Vaidhaa) లో హీరోయిన్ రోల్‌లో కనిపించింది. దీప మరణంతో కోలీవుడ్ వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.

Published by:Sunil Boddula
First published:

Tags: Kollywood, Kollywood Heroin, Tollywood

ఉత్తమ కథలు