Home /News /movies /

Vivek: వివేక్ మృతిపై అనుమానాలు.. దాని వల్లే చనిపోయారంటూ తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు

Vivek: వివేక్ మృతిపై అనుమానాలు.. దాని వల్లే చనిపోయారంటూ తమిళ నటుడు సంచలన వ్యాఖ్యలు

వివేక్

వివేక్

వివేక్‌కు గుండెపోటు రావడానికి, వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని సిమ్స్ ఇది వరకే ప్రకటన ఇచ్చింది. ఐనప్పటికీ వ్యాక్సిన్‌కు, వివేక్ మృతికి ముడిపెడుతూ.. కొందరు విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయింది.

    ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ మృతిపై వివాదం రాజుకుంది. కరోనా టీకా వల్లే ఆయన మరణంచారని తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. టీకా వేసుకోక ముందే ఆయన బాగానే ఉన్నారని.. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత గుండెపోటు వచ్చిందని ఆరోపించారు. శనివారం వివేక్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత మన్సూర్ అలీ ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. దేశంలో కరోనా పేరుతో రాజకీయం చేస్తున్నారని.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ చంపేస్తున్నారని మండిపడ్డారు. కరోనా పరీక్షలు నిలిపివేసి.. కరోనా గురించి వార్తల్లో చెప్పకుంటే.. కరోనానే ఉండదని ఆయన అన్నారు.

    ''కరోనా కేసుల గురించి పత్రికల్లో వార్తలు రాయడం మానేయండి. కరోనా పరీక్షలను నిలిపివేయండి. మరుసటి రోజు నుంచి మనదేశంలో కరోనానే ఉండదు. ప్రజలను భయపెడుతూ ఎందుకు చంపుతున్నారు. ఎవరూ అడిగే వారే లేరనా..? వివేక్ ఆరోగ్యంగానే ఉన్నారు. మరి ఎందుకు కరోనా టీకా వేశారు. వ్యాక్సిన్ వేసిన తర్వాతే గుండెపోటు వచ్చింది. అసలు కరోనా వ్యాక్సిన్ సమర్థవంతమైనదేనా? ఆయన టీకాతో మరణించలేదని ఎలా నిర్ధారిస్తారు. మనదేశంలో కరోనా లాంటి వైరస్‌లు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా పేరుతో రాజకీయం చేస్తున్నారు. ప్రజలను భయపెడుతున్నారు. తొండముత్తూరు నియోజకవర్గంలో ప్రచారం చేసే సమయంలో యాచకుల పక్కనే కూర్చున్నా. గుంపులుగానే తిరిగాం. మాకు కరోనా రాలేదు కదా.'' అని ఉద్వేగంగా మాట్లాడారు మన్సూర్ అలీ.

    59 ఏళ్ల వివేక్ శనివారం ఉదయం కన్నుమూశారు. ఐతే గురువారం చెన్నైలోని గవర్నమెంట్ హై స్పెషాలిటీ హాస్పిటల్‌ వివేక్ కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నారు. ఆ మరుసటి రోజే ఆయనకు గుండెపోటు వచ్చింది. గుండెనొప్పితో కుప్పకూలి స్పృహతప్పి పడిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను సిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడే వివేక్‌కు చికిత్స జరిగింది. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. శనివారం ఉదయం 04.30 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు.


    కాగా, వివేక్‌కు గుండెపోటు రావడానికి, వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని సిమ్స్ ఇది వరకే ప్రకటన ఇచ్చింది. ఐనప్పటికీ వ్యాక్సిన్‌కు, వివేక్ మృతికి ముడిపెడుతూ.. కొందరు విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమయింది. తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలను చైన్నై కార్పొరేషన్ కమిషనర్ ఖండించారు. వ్యాక్సిన్ పట్ల లేని పోని భయాలు సృష్టించవద్దని.. వివేక్ మరణానికి, టీకాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజలు నిర్భయంగా వ్యాక్సిన్ వేసుకోవచ్చని చెప్పారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Chennai, Kollyood News, Kollywood, Tamil Cinema, Tamil nadu, Tamilnadu, Vivek

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు