Vishal: బీజేపీలోకి హీరో విశాల్..? క్లారిటీ ఇచ్చిన మేనేజర్

కంగనాను తమిళ్ నటుడు విశాల్ ప్రశంసల్లో ముంచెత్తాడు. ప్రభుత్వాలు తప్పుచేస్తే ఎలా గళం విప్పాలో అందరికీ చూపించావని.. భగత్‌సింగ్‌లా పోరాడావంటూ ఆకాశానికి ఎత్తారు.

news18-telugu
Updated: September 14, 2020, 6:57 PM IST
Vishal: బీజేపీలోకి హీరో విశాల్..? క్లారిటీ ఇచ్చిన మేనేజర్
విశాల్
  • Share this:
తమిళ్ హీరో విశాల్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీలో ఆయన చేరతారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఆయన కమలం తీర్థం పుచ్చుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విశాల్ పొలిటికల్ ఎంట్రీపై ఆయన మేనేజర్ హరికృష్ణన్ క్లారిటీ ఇచ్చారు. విశాల్ బీజేపీ చేరతారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. విశాల్‌కు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. హరికృష్ణన్ వ్యాఖ్యలతో విశాల్ రాజకీయాల్లోకి ప్రవేశించడం లేదని అందరికీ స్పష్టత వచ్చింది.

కాగా, ఇటీవల బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు విశాల్. మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన క్రమంలోనే బీఎంసీ ఆమె కార్యాలయాన్ని కూల్చివేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కంగనాను తమిళ్ నటుడు విశాల్ ప్రశంసల్లో ముంచెత్తాడు. ప్రభుత్వాలు తప్పుచేస్తే ఎలా గళం విప్పాలో అందరికీ చూపించావని.. భగత్‌సింగ్‌లా పోరాడావంటూ ఆకాశానికి ఎత్తారు. కంగనా వెనక బీజేపీ ఉందని.. అందుకే అంత దూకుడు ప్రదర్శిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఐతే ఆమెకు విశాల్ మద్దతు ఇవ్వడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత విశాల్ త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నారని..బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ఐతే ఆ పుకార్లకు ఆయన మేనేజర్ హరికృష్ణన్ చెక్ పెట్టారు.
Published by: Shiva Kumar Addula
First published: September 14, 2020, 6:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading