Home /News /movies /

KOLKATTA SET IN HYDERABAD FOR SHYAM SINGHA ROY MOVIE BUDGET WILL SHOCKS YOU NR

Shyam Singha Roy: 'శ్యామ్ సింగరాయ్' బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఏకంగా కోల్‌కతానే?

shyama singha roy

shyama singha roy

Shyam Singha Roy: సినీ ఇండస్ట్రీలో సినిమా కోసం, వాటి సెట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎంత బడ్జెట్ నైనా పెట్టగలరు. అంతేకాకుండా హీరోలు వాడే కాస్ట్యూమ్స్ నుంచి సినిమా బ్యాక్ గ్రౌండ్ సెట్ వరకు సినిమా కు ఏది సెట్ అయితే అది వేస్తుంటారు.

    Shyam Singha Roy: సినీ ఇండస్ట్రీలో సినిమా కోసం, వాటి సెట్స్ కోసం దర్శక నిర్మాతలు ఎంత బడ్జెట్ నైనా పెట్టగలరు. అంతేకాకుండా హీరోలు వాడే కాస్ట్యూమ్స్ నుంచి సినిమా బ్యాక్ గ్రౌండ్ సెట్ వరకు సినిమా కు ఏది సెట్ అయితే అది వేస్తుంటారు. అంతే కాకుండా కొన్ని ప్రాంతాలలో సినిమాలను తీయడానికి కూడా ఎంత దూరమైనా వెళ్తుంటారు. అలా కాకుండా ఆ ప్రాంతాల్లో షూటింగ్ తీయడానికి కష్టం అనిపించినప్పుడు.. ఆ ప్రాంతంలో అక్కడి పరిసరాలు ఎలా ఉన్నా అలాగే తయారుచేస్తారు. వాటికి ఎంత ఖర్చు అయినా సరే ఆలోచించకుండా సినిమాను చేసేస్తారు. తాజాగా ఓ సినిమా కోసం ఇలాగే ఓ సెట్ వెయ్యడానికి ఎంతో ఖర్చు చేశారు.

    డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమాలో నాచురల్ స్టార్ హీరో నాని నటిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా విభిన్నమైన కథతో తెరకెక్కనుంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదలవ్వగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్లో ఉండగా.. ఈ సినిమా షూటింగ్ తో బిజీ బిజీగా ఉంది.

    ఇక ఈ సినిమా లో కొన్ని సన్నివేశాలు కోల్ కత్తాలో జరగాల్సి ఉండగా.. కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ ని ఏకంగా హైదరాబాద్ లోనే.. నిర్మించారట. పది ఎకరాల విస్తీర్ణంలో ఈ సినిమాకు కోల్ కత్తా భారీ సెట్ ను వేయగా.. కోల్కత్తా హైదరాబాద్ వచ్చినట్లుగా అనిపిస్తుందని సినీ బృందం తెలిపారు. ఇక ఈ సెట్ కు దాదాపు రూ.6.5 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. ఇక ప్రస్తుతం ఈ సన్నివేశం పూర్తి అయిన వెంటనే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Hero nani, Krithi shetty, Madonna Sebastian, Sai Pallavi, Shyam Singha Roy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు