Home /News /movies /

KODTHE FULL VIDEO SONG FROM GHANI MOVIE RELEASED AND FANS MESMERISED WITH TAMANNAAH BHATIA DANCE SRD

Ghani Movie : గని మూవీ నుంచి సర్ ప్రైజ్.. కొడ్తే అంటూ మిల్కీ అందాలతో రఫ్ఫాడించిన తమన్నా..

Ghani Movie

Ghani Movie

Ghani Movie : ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.

    మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌ (Varun Tej)ప్రస్తుతం గని (Ghani Movie) అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్లతో భారీగా తెరకెక్కింది. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి పూర్తి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్ పాత్రలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ‘గని’ మూవీకి సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమా టోటల్ రన్ టైమ్ 2 గంటల 31 నిమిషాల 17 సెకన్లు ఉంది. ‘గని’ సినిమాను కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో వరుణ్ ఫిజిక్ అదిరిందని అంటున్నారు నెటిజన్స్. గని సినిమాను అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మించారు.

    తాజాగా ఈ సినిమాలోని ‘‘కొడ్తే..’’ అనే వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) అదిరిపోయే అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాటలో ఆమె వేసిన స్టెప్స్ బాగున్నాయి. ఇక చాలా రోజుల తరువాత తమన్నాను ఇంత హాట్‌గా చూశామని ప్రేక్షకులు అంటున్నారు. కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

    వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్రొఫెషనల్ బాక్సింగ్ ట్రెయినింగ్ తీసుకున్నాడు. కాగా ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించేందుకు వరుణ్ భారీ వర్కవుట్స్ చేసి చక్కటి ఫిజిక్‌లోకి వచ్చాడు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసింది. ఈ చిత్రాన్ని సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

    ఇది కూడా చదవండి : రవితేజ ‘ధమాకా’ స్టోరీ లైన్ ఇదేనా.. లీక్ అయిన అసలు కథ..

    తొలిసారి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కథతో వస్తున్న వరుణ్ తేజ్ ‘గని’ చిత్రంపై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ సినిమాలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి వంటి యాక్టర్స్ నటిస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి గని చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే ఏప్రిల్ 8 వరకు ఆగాల్సిందే.

    లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ కూడా మంచి టాక్ సంపాదించుకుంది. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఇప్పటికే కోటికి పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. బాక్సింగ్ చాంపియన్ కావాలనుకునే ‘గని’నుంచి జీవితంలో బాక్సింగ్ ఆడనని అమ్మకు మాటిస్తాడు. మరి అమ్మ మాటను జవదాటి ఎలా బాక్సింగ్‌లో గని నేషనల్ ఛాంపియర్ అయ్యాడనేదే ‘గని’ మూవీ స్టోరీలా కనిపిస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమా స్టోరీనే కాస్తా అటు ఇటు మార్చి తెరకెక్కించారు. ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు బాలీవుడ్‌లో చాలానే తెరకెక్కాయి. మధ్యలో హీరోయిన్‌తో లవ్ ట్రాక్ వంటివి ఉన్నాయి. మొత్తంగా ఈ సినిమా కోసం వరుణ్ తేజ్.. సిక్స్ ప్యాక్ బాడీ కోసం బాగానే చెమటోడ్చాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Ghani Movie, Tamannaah Bhatia, Tollywood news, Varun Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు