Home /News /movies /

KODI RAMAKRISHNA BIRTH ANNIVERSARY SPECIAL TOLLYWOOD LEGENDARY DIRECTORS THESE ARE THE QUALITIES OF DIRECTOR TA

HBD Kodi Ramakrishna: కోడి రామకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనదో డిఫరెంట్ జానర్..

కోడి రామకృష్ణ జయంతి (Twitter/Photo)

కోడి రామకృష్ణ జయంతి (Twitter/Photo)

 Kodi Ramakrishna Birth Anniversary | తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కానీ దర్శకుడు కోడి రామకృష్ణ మాత్రం డైరెక్టర్‌గా ఒక్క జానర్‌కు పరిమితం కాలేదు. ఈ రోజు ఈ దర్శకుడి జయంతి.

Kodi Ramakrishna Birth Anniversary | తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో దర్శకుడికి ఒక్కో స్టైల్ ఉంటుంది. కానీ దర్శకుడు కోడి రామకృష్ణ మాత్రం డైరెక్టర్‌గా ఒక్క జానర్‌కు పరిమితం కాకుండా ఫ్యామిలీ, యాక్షన్, హార్రర్, భక్తి, పొలిటికల్ సెటైర్, గ్రామీణ నేపథ్యం ఇలా అన్ని జానర్స్‌లో సినిమలు తీసి సక్సెస్ అందుకున్న దర్శకుల్లో కోడిరామకృష్ణ ముందు వరసలో ఉంటారు. ఈయన తెరకెక్కిన చిత్రాల్లో అత్యధికం తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ మూవీస్‌గా నిలిచాయి. దాస‌రి నారాయ‌ణ‌రావు, రాఘ‌వేంద్రరావు లాంటి ఎంద‌రో లెజెండ‌రీ ద‌ర్శ‌కుల హవా కొనసాగుతున్న సమయంలో దర్శకుడిగా ప్రవేశించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కోడి రామకృష్ణ.

తొలి సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో  సంచ‌ల‌న విజ‌యం అందుకున్నాడు. చిరంజీవి, మాధవి హీరో, హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం  ఏడాది పాటు ఆడింది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ‌య్య త‌ర్వాత ఆయ‌న ఫ్యామిలీ సినిమాలు మాత్ర‌మే తీస్తాడేమో అనుకున్నారు.

చిరంజీవి, గొల్లపూడితో కోడి రామకృష్ణ (File/Photo)


ఆ తర్వాత ఈ దర్శకత్వంలో వచ్చిన ‘తరంగణి’ సినిమాతోనే సుమన్ హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా కూడా ఏడాదికి పైగా నడవడం విశేషం. ఎన్నో ట్రెండ్ సెట్టర్ సినిమాలను తెరకెక్కించిన కోడి రామకృష్ణ 1949లో జూలై 23 న పాలకొల్లులో జన్మించారు. ఇక కోడి రామకృష్ణకు తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ, అర్జున్, రాజశేఖర్‌లో ప్రత్యేక అనుబంధం ఉంది. ముఖ్యంగా  సోలో హీరోగా వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణకు ‘మంగమ్మ గారి మనవడు’తో గోల్డెన్ జూబ్లీ హిట్ అందించాడు. ఈ సినిమా కూడా ఏడాదికి పైగా నడవడం విశేషం.

బాలయ్య, కోడిరామకృష్ణ దర్శకత్వంలో మంగమ్మ గారి మనవడు (Facebook/Photo)


ఆ తర్వాత బాలయ్యతో చేసిన ‘ముద్దుల మావయ్య, ముద్దుల మేనల్లుడు, మువ్వగోపాలుడు, ‘బాల గోపాలడు’, ముద్దుల కృష్ణయ్య, ‘భారతంలో బాలచంద్రుడు’ వంటి హిట్ సినిమాలను అందించిన ఘనత కోడి రామకృష్ణది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో ప్రారంభమైన ఒక జానపద సినిమా మధ్యలో ఆగిపోయింది. ఇక యాక్షన్ కింగ్ అర్జున్‌తో కూడా ‘మా పల్లెలో గోపాలుడు’, ‘మన్నెంలో మొనగాడు’ నుంచి పుట్టింటికి రా చెల్లి’ వరకు ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. వీళ్లిద్దరి తర్వాత హీరో రాజశేఖర్‌తో తెరకెక్కించిన ‘తలంబ్రాలు’ కూాడా తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘ఆహుతి’,స్టేషన్ మాస్టర్’ ‘అంకుశం’ తెలుగు సినిమా చరిత్రలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. హీరోగా రాజశేఖర్ ఎక్కువగా బ్లాక్ బస్టర్స్ అందుకుంది కోడి రామకృష్ణ దర్శకత్వంలోనే అని చెప్పాలి.

పోటీస్ బ్యాక్ డ్రాప్ చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ’అంకుశం’ (Twitter/Photo)


ఈయన తెరకెక్కించిన పొలిటిలక్ సెటెర్ మూవీస్‌లో  ‘భారత్ బంద్’ వంటి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ తర్వాత ’పెళ్లాం చెబితే వినాలి’ , ‘అల్లరి పిల్ల’ వంటి హాస్య ప్రధాన చిత్రాలను తెరకెక్కించి విజయాలను అందుకున్నారు. ఆంతేనా..ముఖ్యంగా  తెలుగు ఇండస్ట్రీకి విజువల్ ఎఫెక్ట్స్ పరిచయం చేసింది కోడి రామకృష్ణ అనే చెప్పాలి.  ఓ రకంగా తెలుగు సినిమాకు విజువల్ మాయాజాలం అలవాటు చేసింది ఈయనే.

Kodi Ramakrishna.. The director who introduced Visual Effects to Telugu Cinema pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో దాస‌రి నారాయ‌ణ‌రావు, రాఘ‌వేంద్రరావు లాంటి ఎంద‌రో లెజెండ‌రీ ద‌ర్శ‌కులున్నారు. అలాంటి హేమాహేమీలు ఉన్న‌పుడు ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు కోడి రామ‌కృష్ణ. తొలి సినిమాతోనే సంచ‌ల‌న విజ‌యం అందుకుని ఏడాది పాటు ఆడిన సినిమాను ఇచ్చాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ‌య్య త‌ర్వాత ఆయ‌న ఫ్యామిలీ సినిమాలు మాత్ర‌మే తీస్తాడేమో అనుకున్నారు. kodi ramakrishna passes away,director kodi ramakrishna passes away,kodi ramakrishna,kodi ramakrishna movies,director kodi ramakrishna,kodi rama krishna,kodi ramakrishna interview,director kodi ramakrishna interview,director kodi rama krishna health,kodi ramakrishna exclusive interview,arundathi director kodi rama krishna,kodi ramakrishna latest movie,kodi ramakrishna hospitalised,director kodi ramakrishna movies,kodi rama krishna health,కోడి రామకృష్ణ,కోడి రామకృష్ణ మరణం,కోడి రామకృష్ణ కన్నుమూత,తెలుగు సినిమా
కోడి రామకృష్ణ విజువల్ వండర్స్


తెలుగు ఇండ‌స్ట్రీని విఎఫ్ఎక్స్ వైపు న‌డిపించిన తొలి ద‌ర్శ‌కుడు ఈయ‌నే. 1995లో వ‌చ్చిన అమ్మోరు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో కొత్త చ‌రిత్ర సృష్టించారు కోడి రామకృష్ణ. ఆ సినిమాతో అప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా చూడ‌ని ఓ స‌రికొత్త విజువ‌ల్ ప్ర‌పంచాన్ని తెర‌పై ఆవిష్కరించారు ఈ ద‌ర్శ‌కుడు. ముఖ్యంగా ‘అమ్మోరు’ సినిమాలో నీటిలోంచి చేయి బ‌య‌టికి వ‌చ్చే స‌న్నివేశం ఇప్ప‌టికీ హైలైట్. ఆ త‌ర్వాత ‘దేవీ’ సినిమాతో మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించారు ఈయ‌న‌. ప్రేమ హీరోయిన్‌గా వ‌చ్చిన ఈ చిత్రంతోనే దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు.

Kodi Ramakrishna.. The director who introduced Visual Effects to Telugu Cinema pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో దాస‌రి నారాయ‌ణ‌రావు, రాఘ‌వేంద్రరావు లాంటి ఎంద‌రో లెజెండ‌రీ ద‌ర్శ‌కులున్నారు. అలాంటి హేమాహేమీలు ఉన్న‌పుడు ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు కోడి రామ‌కృష్ణ. తొలి సినిమాతోనే సంచ‌ల‌న విజ‌యం అందుకుని ఏడాది పాటు ఆడిన సినిమాను ఇచ్చాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ‌య్య త‌ర్వాత ఆయ‌న ఫ్యామిలీ సినిమాలు మాత్ర‌మే తీస్తాడేమో అనుకున్నారు. kodi ramakrishna passes away,director kodi ramakrishna passes away,kodi ramakrishna,kodi ramakrishna movies,director kodi ramakrishna,kodi rama krishna,kodi ramakrishna interview,director kodi ramakrishna interview,director kodi rama krishna health,kodi ramakrishna exclusive interview,arundathi director kodi rama krishna,kodi ramakrishna latest movie,kodi ramakrishna hospitalised,director kodi ramakrishna movies,kodi rama krishna health,కోడి రామకృష్ణ,కోడి రామకృష్ణ మరణం,కోడి రామకృష్ణ కన్నుమూత,తెలుగు సినిమా
కోడి రామకృష్ణ విజువల్ వండర్స్


‘దేవీ’ త‌ర్వాత చిరంజీవి ‘అంజి’ సినిమాతో విజువ‌ల్ మాయాజాలం మ‌రో స్థాయికి వెళ్లిపోయింది. ఈ సినిమాతో మ‌న తెలుగు సినిమా స్థాయి జాతీయ వ్యాప్తంగా పాపుల‌ర్ అయింది. ఈ సినిమాకు ఉత్త‌మ విజువ‌ల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేష‌నల్ అవార్డ్ కూడా అందుకున్నారు కోడి రామకృష్ణ. ఇక ‘దేవీ పుత్రుడు’ సినిమా మ‌రో సంచ‌ల‌నం. విజ‌యం సాధించ‌క‌పోయినా కూడా ఈ సినిమా అప్ప‌ట్లో చాలా పెను మార్పుల‌కు శ్రీకారం చుట్టింది.

Kodi Ramakrishna.. The director who introduced Visual Effects to Telugu Cinema pk.. తెలుగు ఇండ‌స్ట్రీలో దాస‌రి నారాయ‌ణ‌రావు, రాఘ‌వేంద్రరావు లాంటి ఎంద‌రో లెజెండ‌రీ ద‌ర్శ‌కులున్నారు. అలాంటి హేమాహేమీలు ఉన్న‌పుడు ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు కోడి రామ‌కృష్ణ. తొలి సినిమాతోనే సంచ‌ల‌న విజ‌యం అందుకుని ఏడాది పాటు ఆడిన సినిమాను ఇచ్చాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ‌య్య త‌ర్వాత ఆయ‌న ఫ్యామిలీ సినిమాలు మాత్ర‌మే తీస్తాడేమో అనుకున్నారు. kodi ramakrishna passes away,director kodi ramakrishna passes away,kodi ramakrishna,kodi ramakrishna movies,director kodi ramakrishna,kodi rama krishna,kodi ramakrishna interview,director kodi ramakrishna interview,director kodi rama krishna health,kodi ramakrishna exclusive interview,arundathi director kodi rama krishna,kodi ramakrishna latest movie,kodi ramakrishna hospitalised,director kodi ramakrishna movies,kodi rama krishna health,కోడి రామకృష్ణ,కోడి రామకృష్ణ మరణం,కోడి రామకృష్ణ కన్నుమూత,తెలుగు సినిమా
కోడి రామకృష్ణ విజువల్ వండర్స్


ఇక 2009లో సంక్రాంతికి వ‌చ్చిన ‘అరుంధతి’ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఈ సినిమాతోనే అనుష్క సూప‌ర్ స్టార్ అయింది. కోడి రామ‌కృష్ణ ప‌ని అయిపోయింది అనుకున్న స‌మ‌యంలో ఈ సినిమాతో మ‌ళ్లీ తానున్నాన‌ని తెలుగు సినీ ఇండస్ట్రీకి మరోసారి గుర్తు చేసారు ఈయ‌న‌. అరుంధ‌తి త‌ర్వాత అవ‌తారం, నాగ‌భ‌ర‌ణం లాంటి సినిమాలు తెర‌కెక్కించినా అవి విజ‌యం సాధించ‌లేదు. మొత్తానికి తెలుగు ఇండ‌స్ట్రీలో విజువ‌ల్ ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించిన ఘ‌న‌త మాత్రం కోడి రామ‌కృష్ణదే. ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈయన  2019 ఫిబ్రవరి 22న అనారోగ్యంతో ఈ లోకం విడిచి వెళ్లారు. ఆయన కనుమూసినా.. ఆయన సినిమాలతో మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Kodi Ramakrishna, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు