పవన్ కల్యాణ్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన ‘కొబ్బరి మట్ట’ టీం

పవన్ కల్యాణ్‌కు ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు సోషల్ మీడియాలో అయితే ఆయన ఫ్యాన్స్ ట్వీట్లతో ముంచెత్తుతున్నారు.

news18-telugu
Updated: September 2, 2019, 7:59 AM IST
పవన్ కల్యాణ్‌కు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన ‘కొబ్బరి మట్ట’ టీం
పవన్ కల్యాణ్
news18-telugu
Updated: September 2, 2019, 7:59 AM IST
ఇవాళ టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు సోషల్ మీడియాలో అయితే ఆయన ఫ్యాన్స్ ట్వీట్లతో ముంచెత్తుతున్నారు. మరోవైపు పవర్ స్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆయన స్థాపించిన జనసేనకు తోచిన మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. తాజాగా ‘కొబ్బరి మట్ట’  సినిమా టీమ్ కూడా జనసేనానికి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది.  జనసేన పార్టీకి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చింది.

మా టీం ఇచ్చిన మాట ప్రకారం నేను, సంపూర్ణేశ్ బాబు, ఉమా మహేశ్.. జనసేన పార్టీకి లక్ష రూపాయలు విరాళంగా అందజేశామని ‘కొబ్బరి మట్ట’ నిర్మాత సాయి రాజేశ్ ట్విట్టర్‌లో ఓ ట్వీట్ పోస్టు చేశారు. జనసేన పార్టీ భీమిలి అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సందీప్ పంచకర్లకు చెక్కును పంపించామని ఆయన చెక్ ఫోటోను కూడా పోస్టు చేశారు. తమ సినిమాను హిట్ చేసిన అందరు హీరోల అభిమానులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.





First published: September 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...