Home /News /movies /

KNOW THE COST OF THAT SINGLE MISTAKE MADE BY RAJAMOULI YOU WILL BE SHOCKED WHAT HAPPENED MK

RRR: రాజమౌళి చేసిన ఆ ఒక్క తప్పు ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ తింటారు..ఏం జరిగందంటే..?

ఆర్ఆర్ఆర్ మూవీ మరో రికార్డు (Twitter/Photo)

ఆర్ఆర్ఆర్ మూవీ మరో రికార్డు (Twitter/Photo)

RRR సినిమా రాజమౌళి, రాంచరణ్, తారక్ లు పడ్డ నాలుగేళ్ల కష్టం. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు జనవరి 7న మాత్రం రిలీజ్ అవుతుందని అంతా ఊహించారు. అంతేకాదు RRR రిలీజ్ ఇఫ్పటికే మూడు సార్లు వాయిదా పడింది.

  RRR సినిమా రాజమౌళి, రాంచరణ్, తారక్ లు పడ్డ నాలుగేళ్ల కష్టం. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు జనవరి 7న మాత్రం రిలీజ్ అవుతుందని అంతా ఊహించారు. అంతేకాదు RRR రిలీజ్ ఇఫ్పటికే మూడు సార్లు వాయిదా పడింది. ముచ్చటగా నాలుగో సారి కూడా వాయిదా పడింది. కానీ జనవరి 7న మాత్రం కచ్చితంగా రిలీజ్ అవుతుందని భావించిన అటు రాజమౌళి అండ్ టీం కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసింది.  అయితే రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో RRR సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులంతా ఉసూరుమన్నారు.  గతంలో రెండు సార్లు వాయిదా పడ్డప్పటికీ, అఖండ, పుష్ప ఇచ్చిన జోష్ తో సంక్రాంతి సెలవల నేపథ్యంలో  జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామన్న ధీమాతో RRR మూవీ ప్రమోషన్ భారీగా చేసేశారు. రిలీజ్ కు దాదాపు 15 రోజుల ముందు నుంచే దేశంలోని అన్ని ముఖ్యమైన నగరాలతో పాటు అన్ని భాషల్లోనూ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేశారు. బాలివుడ్ గుండె అయిన ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు వంటి నగరాల్లో భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. ఆయా నగరాల్లో చేసిన ఈవెంట్స్ కు RRR యూనిట్ అంతా తరలివెళ్లింది. అటు హీరోయిన్ ఆలియా భట్ సైతం ప్రమోషన్స్ లో పాల్గొంది.

  కరోనా దెబ్బకు ఆర్ఆర్ఆర్ వాయిదా పడటం ఇది వరుసగా మూడోసారి. ఇఫ్పటికే షూటంగ్ సమయంలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల షెడ్యూల్స్ క్యాన్సిల్ అవుతూనే వచ్చింది. మొత్తానికి ఎలాగోలా సినిమాను పూర్తి చేశారు. వరుసగా ఏడాది నుంచి సినిమా రిలీజ్ వార్తలు వస్తున్నా, జనవరి 7న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ఈ సారి ఒమిక్రాన్ దెబ్బ కొట్టేసింది. ఒమిక్రాన్ ప్రభావంతో ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడింది. రాజమౌళి ప్లానింగ్‌ కు కరోనా దెబ్బ వేయడంతో,   ఎప్పటికప్పుడు బెడిసి కొడుతూనే ఉంది.

  RRR సినిమా ప్రమోషన్స్ కోసం నిర్మాత దానయ్య, అలాగే వివిధ భాషల్లో హక్కులు కొనుగోలు చేసిన నిర్మాతలు పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కేవలం RRR మూవీ ప్రమోషన్స్ కోసం ఏకంగా 40 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు సినిమా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ విషయాన్ని  సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. RRR ప్రమోషన్స్ కోసం రాజమౌళి 40 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని అతడు పెద్ద బాంబు పేల్చాడు. నిజానికి రూ. 40 కోట్ల రూపాయలతో చిన్న బడ్జెట్ సినిమాలు ఓ పది నుంచి ఇరవై వరకూ ఈజీగా తీసి రిలీజ్ చేయవచ్చు.

  ఇక RRR సినిమా మరోసారి విడుదల వాయిదా పడటంతో ఇప్పటి దాకా చేసిన ప్రమోషన్ కార్యక్రమాలన్నీ వృధా అయినట్టేనని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. ఆలియాభట్, అజయ్ దేవగన్ లాంటి తారలతో పాటు ఇతర నటీనటులు సైతం తమ విలువైన సినిమా డేట్స్ వదులుకొని మరీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇక ముంబైలో చేసిన ఈవెంట్ కు ఏకంగా సల్మాన్ ఖాన్ ను ఆహ్వానించారు. ఆ ఈవెంట్ లో డబ్బును మంచినీళ్లలా ఖర్చుపెట్టారు.   ఇలా RRR ప్రమోషన్స్ కోసం ఖర్చు చేసిన  కోట్ల రూపాయలు బూడిదలో పోసినట్లేనని వినిపిస్తోంది. బడ్జెట్ భారీగా పెరిగిందని నిర్మాతలు ఆందోళన చెందుతుంటే, ఇప్పుడు ఇలా ప్రమోషన్స్ వల్ల డబ్బు మరంత వృధా కావడం ఆవేధన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
  Published by:Krishna Adithya
  First published:

  Tags: RRR

  తదుపరి వార్తలు