SR Kalyanamandapam closing collections: ‘SR కళ్యాణమండపం’ క్లోజింగ్ కలెక్షన్స్.. బిజినెస్‌కు రెండింతలు లాభాలు..

SR Kalyanamandapam First day collections Photo : Twitter

SR Kalyanamandapam closing collections: కుర్రాడి నమ్మకమే గెలిచింది. ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొత్త సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు తటపటాయిస్తున్నారు. ఇలాంటి సమయంలో విడుదలైన SR కళ్యాణమండపం సినిమా రప్ఫాడించింది. క్లోజింగ్ కలెక్షన్స్‌లో (SR Kalyanamandapam closing collections) రెండింతలు లాభాలు తీసుకొచ్చింది.

  • Share this:
కుర్రాడి నమ్మకమే గెలిచింది. ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొత్త సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు తటపటాయిస్తున్నారు. అగ్ర నిర్మాతలు అయితే తమ సినిమాను గుట్టుచప్పుడు కాకుండా ఓటిటికి ఇచ్చేస్తున్నారు. థియేట్రికల్ విడుదల అంటేనే భయపడుతున్నారు. అసలు తమ సినిమాను థియేటర్స్ వైపు తీసుకురాడానికి కూడా భయపడుతున్న తరుణంలో.. ఓ కుర్రాడు మాత్రం ధైర్యంగా వచ్చేసాడు. సెకండ్ వేవ్ తర్వాత ఫస్ట్ హిట్ కొట్టేసాడు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే చెప్పింది చెప్పినట్లు చేసి చూపించాడు. అతడే కిరణ్ అబ్బవరం.. అతడు చేసిన సినిమా SR కళ్యాణమండపం. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాసింది ఆయనే. ఆగస్ట్ 6న విడుదలైన ఈ చిత్రం ఫుల్ రన్ కలెక్షన్స్ వచ్చాయి. దాదాపు 8.30 కోట్ల షేర్ వసూలు చేసి రెండింతలు లాభాలు తీసుకొచ్చింది. ఈ మధ్యే సినిమా ఆహాలో కూడా విడుదలైంది.

చాలా రోజుల తర్వాత థియేటర్స్ బయట హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించేలా చేసింది ఎస్ఆర్ కళ్యాణమండపం. ఈ ఒక్క సినిమా విజయంతో చాలా మంది నిర్మాతలకు నమ్మకం కలుగుతుంది. నైజాం, రాయలసీమ ఏరియాల్లో ఇప్పటికే SR కళ్యాణమండపం భారీ లాభాలు తీసుకొచ్చింది. మరి క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతో ఓ సారి చూద్దామా..

నైజాం: 2.94 కోట్లు
సీడెడ్: 1.15 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.98 కోట్లు
ఈస్ట్: 0.51 కోట్లు
వెస్ట్: 0.35 కోట్లు
గుంటూరు: 0.69 కోట్లు
కృష్ణా: 0.42 కోట్లు
నెల్లూరు: 0.25 కోట్లు

ఏపీ + తెలంగాణ: 7.66 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.70 కోట్లు
వరల్డ్ వైడ్: 8.31 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా SR కళ్యాణమండపం సినిమాను రూ 4.55 కోట్లకు అమ్మారు. ఇంత బిజినెస్ వర్కవుట్ కాదని చాలా మంది చెప్పినా కూడా సినిమాపై నమ్మకంతో ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు కిరణ్. ఇప్పుడు ఆయన నమ్మకమే నిజమైంది. రొటీన్ కథ అంటూనే సినిమాకు కలెక్షన్స్ కట్టబెడుతున్నారు ప్రేక్షకులు. వీకెండ్ వరకు రప్ఫాడించింది ఈ చిత్రం.

Pawan Kalyan - Surekha: వదినను ఆట పట్టించిన పవన్ కళ్యాణ్.. ప్రేమతో మరిదిని కొట్టిన చిరంజీవి బార్య సురేఖ..!


ఏపీలో టికెట్ రేట్స్ తక్కువగా ఉండటంతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీ కారణంగా SR కళ్యాణమండపం సినిమా కలెక్షన్స్‌పై చాలా ప్రభావం పడింది. ఏదేమైనా కూడా సెకండ్ వేవ్ తర్వాత తొలి విజయంగా నిలిచిపోయింది SR కళ్యాణమండపం. ఈ సినిమాలో ప్రియాంక జవల్కర్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీధర్ గాదె తెరకెక్కించాడు.
Published by:Praveen Kumar Vadla
First published: