SR Kalyana Mandapam: ‘SR క‌ళ్యాణమండంపం EST 1975’ ట్రైల‌ర్ అదుర్స్.. ఎంటర్‌టైన్మెంట్ విత్ ఎమోషన్..

SR కళ్యాణ మండపం సినిమా (sr kalyana mandapam)

SR Kalyana Mandapam: రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా నటించిన సినిమా SR కళ్యాణ మండపం. ఈ చిత్ర ట్రైలర్ విడుదలైందిప్పుడు.

  • Share this:
రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై ప్ర‌మోద్ - రాజు నిర్మాత‌లుగా, నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెరకెక్కించిన సినిమా SR క‌ళ్యాణమండంపం EST 1975. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఓ అస‌క్తిని క్రియేట్ చేసుకుంది. ఆ ఉత్కంఠ‌ని మ‌రింత పెంచుతూ ఆ త‌రువాత విడుద‌ల చేసిన చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార, సిగ్గేంద‌కు రా మావ‌ వంటి పాట‌లు యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుద‌ల చేసిన టీజ‌ర్ కి సైతం అంతటా అనూహ్య స్పంద‌న ల‌భించ‌డ‌మే కాకుండా, టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రం హాట్ టాపిక్ గా మారడం విశేషం.

ఇటీవ‌లే SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రాన్ని ఆగ‌స్ట్ 6న‌ థియేట‌ర్ లో విడుద‌ల చేస్తున్నామంటూ అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా అందుకు త‌గ్గ‌ట్లుగా నిర్మాత‌లు ప్ర‌మోద్ - రాజులు సన్నాహాలు చేస్తున్నారు. శంక‌ర్ పిక్చ‌ర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చేత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే, ఈ నేప‌థ్యంలో తాజాగా SR క‌ళ్యాణమండంపం EST 1975 ట్రైల‌ర్‌ విడుద‌లైంది. హైద‌రాబాద్ ఏ ఎమ్ బి మ‌ల్టీప్లేక్స్ థియేట‌ర్ లో SR క‌ళ్యాణమండంపం EST 1975 ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది, ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర బృందంతో పాటు ప్ర‌ముఖ న‌టులు సాయికుమార్ గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా
Kiran Abbavaram SR Kalyana Mandapam movie trailer,Kiran Abbavaram SR Kalyana Mandapam,Kiran Abbavaram movies,Kiran Abbavaram SR Kalyana Mandapam movie trailer released,Kiran Abbavaram priyanka jawalkar,telugu cinema,SR కళ్యాణ మండపం,SR కళ్యాణ మండపం ట్రైలర్ విడుదల,కిరణ్ అబ్బవరం SR కళ్యాణ మండపం ట్రైలర్ విడుదల
SR కళ్యాణ మండపం సినిమా (sr kalyana mandapam)

డైలాగ్ కింగ్ సాయికుమార్ గారు మాట్లాడుతూ.. నా సినీ జీవితాన్ని మ‌లుపు తిప్పిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో పోలీస్ స్టోరీ, ప్ర‌స్థానం చిత్రాలు నాకు ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ఇచ్చాయి. నా యాభై ఏళ్ల సినీ జీవితంలో నేను ఇప్ప‌టి వ‌రుకు పోషించిన పాత్ర‌లు నా ఫ‌స్ట్ ఇన్నింగ్స్ కి వైభ‌వాన్ని తీసుకొస్తే నా సెకండ్ ఇన్నింగ్స్ కి అద్భుత‌మైన గుర్తింపును తీసుకొచ్చే సినిమాగా SR క‌ళ్యాణమండంపం EST 1975 అవ్వ‌డం ఖాయం. హీరో కిర‌ణ్ అబ్బ‌వరం చాలా ఫోక‌స్ డ్ గా ప‌నిచేస్తూ ఉంటాడు, ఈ సినిమాతో కిరణ్ మంచి పేరు, గుర్తింపు రావాల‌ని కోరుకుంటున్నాను, అలానే ప్రేక్ష‌కుల మా ఈ చిత్రాన్ని థియేట‌ర్స్ లో చూసి ప్రోత్స‌హించాల‌ని ప్రార్థిస్తున్నాను అని అన్నారు
Kiran Abbavaram SR Kalyana Mandapam movie trailer,Kiran Abbavaram SR Kalyana Mandapam,Kiran Abbavaram movies,Kiran Abbavaram SR Kalyana Mandapam movie trailer released,Kiran Abbavaram priyanka jawalkar,telugu cinema,SR కళ్యాణ మండపం,SR కళ్యాణ మండపం ట్రైలర్ విడుదల,కిరణ్ అబ్బవరం SR కళ్యాణ మండపం ట్రైలర్ విడుదల
SR కళ్యాణ మండపం సినిమా (sr kalyana mandapam)

హీరో కిర‌ణ్ అబ్బ‌వరం మాట్లాడుతూ.. కుటంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా మా SR క‌ళ్యాణమండంపం EST 1975. ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తిఒక్క‌రికి నేను ప్ర‌త్యేకంగా కృతజ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను. నేను థియేట‌ర్ల‌లో, టీవీల్లో చూసిన సాయికుమార్ వంటి గొప్ప న‌టులు ప‌క్క‌న నేను న‌టించ‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాను న‌మ్మి ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్ తీసుకున్న శంక‌ర్ పిక్చ‌ర్స్ వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. నేనే క‌థ చెప్ప‌గానే న‌న్ను న‌మ్మిన ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ అధినేతలు ప్ర‌మోద్, రాజుల‌కు ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను. వారి ప్రోత్సాహం లేక‌పోతే ఈ సినిమా ఇలా వ‌చ్చేది కాదు. అలానే ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఈ సినిమా ఆద్యంతం అల‌రించే రీతిన తీర్చిదిద్దారు. మేమంతా చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని ఆగ‌స్ట్ 6న థియేట‌ర్ల‌కి వ‌చ్చి ప్రేక్ష‌కులు ప్రోత్స‌హిస్తార‌ని కోరుకుంటున్నాను అని అన్నారు
Published by:Praveen Kumar Vadla
First published: