KIRAN ABBAVARAM SEBASTIAN PC 524 MOVIE TRAILER AND ITS IMPRESSIVE PK
Kiran Abbavaram Sebastian trailer: ‘సెబాస్టియన్ పిసి524’ ట్రైలర్ రివ్యూ.. కిరణ్ అబ్బవరం హిట్ కొట్టేలా ఉన్నాడుగా..!
సెబాస్టియన్ పిసి 524 ట్రైలర్ (sebastian pc 524)
Kiran Abbavaram Sebastian trailer: ‘రాజావారు రాణిగారు’ (Rajavaru Ranigaru) సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) టాలీవుడ్లో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. తన రెండో చిత్రం ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’తో (SR Kalyanamandapam) కూడా సాలిడ్ సక్సెస్ అందుకున్నారు.
Kiran Abbavaram Sebastian trailer: ‘రాజావారు రాణిగారు’ (Rajavaru Ranigaru) సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) టాలీవుడ్లో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. తన రెండో చిత్రం ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’తో (SR Kalyanamandapam) కూడా సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. క్లాసు-మాసు, యూత్- ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా మార్చి 4న ‘సెబాస్టియన్ పిసి 524’తో హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా, సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మాతలుగా, బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘సెబాస్టియన్ పిసి524’. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది.
ఈ సినిమాను ముందు ఫిబ్రవరి 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే రోజు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా వస్తుండటంతో.. వారం రోజులు ఆగి వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఇదే విషయాన్ని మొన్న ప్రమోషనల్ వీడియోలో కూడా చెప్పుకొచ్చాడు ఈ హీరో. పవన్ వస్తే తన సినిమా వాయిదా వేసుకుంటామని చెప్పాడు. ఇప్పుడు అన్నట్లుగానే వారం ఆలస్యంగా వస్తున్నాడు కిరణ్. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ చిత్రాల విజయంతో దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరపుకు మా ‘సెబాస్టియన్ పిసి524’ ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ ఇస్తుంది.
జిబ్రాన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ముఖ్యంగా ‘హెలి’ అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశం. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో సినిమా కథ మొత్తం చూపించారు. మార్చ్ 4వ తేదీన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు అన్నారు. కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.