హోమ్ /వార్తలు /సినిమా /

Kiran Abbavaram: క్లాసిక్ లుక్‌లో కిరణ్ అబ్బవరం.. !

Kiran Abbavaram: క్లాసిక్ లుక్‌లో కిరణ్ అబ్బవరం.. !

kiran abbavaram

kiran abbavaram

ఇటీవలే సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ప్రస్తుతం "నేను మీకు బాగా కావాల్సినవాడిని" అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రం నుండి ఇదివరకే రిలీజైన టీజర్ కు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కిరణ్ అబ్బవరం టాలీవుడ్‌లో ప్రస్తుతం అప్ కమింగ్ హీరో.  ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షార్ట్ ఫిలింస్ తీస్తున్న సమయంలో కిరణ్ అబ్బవరం చాలామంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీ లో ఎదగడానికి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చాలామంది అంటారు. కానీ అతి తక్కువమంది మాత్రమే టాలెంట్ ఉంటే చాలు అని నిరూపిస్తారు. మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరనుంచి మొదలుపెడితే రవితేజ, నాని, విజయ్ దేవరకొండ లాంటి ఎంతోమంది గురించి చెప్పొచ్చు ప్రస్తుతం ఇదే లిస్ట్ లో ఈ మధ్యకాలంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా చేరాడని చెప్పొచ్చు.


షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి "రాజావారు రాణిగారు" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్, అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సాధించుకున్నాడు. తన రెండవ సినిమా ఎస్.ఆర్. కళ్యాణ్ మండపం సినిమాతో ఒక రచయిత గా కూడా మంచి మార్కులు సాధించాడు. కేవలం వినోదభరితమైన సినిమాలు మాత్రమే కాకుండా తన కెరియర్‌లో సెబాస్టియన్ లాంటి వైవిధ్యమైన సినిమాలను కూడా చేసాడు. ఇటీవలే సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ ప్రస్తుతం "నేను మీకు బాగా కావాల్సినవాడిని" అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రం నుండి ఇదివరకే రిలీజైన టీజర్ కు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో నిర్మిస్తున్నారు.ఈ సినిమా మాత్రమే కాకుండా కిరణ్ ఇంకొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ఫ్యామిలీ బాక్గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో తనకంటూ ఒక బాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. గీతా ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలలో సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మంచి కథలను ఎన్నుకోవడం, మంచి సినిమాలు చేయడమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖులకి, మీడియా ప్రతినిధులకి గౌరవాన్ని చూపించడం, అలానే అభిమానులకి చేరువగా ఉంటూ మాట్లాడటం లాంటి విషయాలు కిరణ్ అబ్బవరం పై సదాభిప్రాయం కలిగిస్తున్నాయని చెప్పొచ్చు.

First published:

Tags: Kiran abbavaram, Tollywood

ఉత్తమ కథలు