Home /News /movies /

KIRAN ABBAVARAM NENU MIKU BAGA KAVALSINAVADINI NACHAVABBAI SONG RELEASED SB

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం సినిమా నుంచి "నచ్చావ్ అబ్బాయి" పాట విడుదల.. !

కిరణ్ అబ్బవరం నచ్చావ్ అబ్బాయి పాట విడుదల

కిరణ్ అబ్బవరం నచ్చావ్ అబ్బాయి పాట విడుదల

S R కళ్యాణమండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. "నచ్చావ్ అబ్బాయి" పాటలో కిరణ్ అబ్బవరం వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని" చిత్రం నుండి "నచ్చావ్ అబ్బాయి" పాటను విడుదల చేసింది చిత్ర బృందం. యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని. S R కళ్యాణమండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.. ఇందులో చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి "నచ్చావ్ అబ్బాయి" పాట విడుదలైంది.

    ఇదివరకే విడుదలైన ఈ సినిమా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఈ చిత్రం నుండి ఒక మాస్ బీట్ ను రిలీజ్ చేసారు. "నచ్చావ్ అబ్బాయి" పాటలో కిరణ్ అబ్బవరం వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.



    ఇక ఈ సినిమాలో... కిర‌ణ్ అబ్బ‌వ‌రం, సంజ‌న ఆనంద్‌, సోనూ ఠాకూర్, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా భాస్క‌ర్‌, స‌మీర్‌, సంగీత‌, నిహ‌రిక‌, ప్ర‌మోదిని, భరత్ రొంగలి త‌దిత‌రులు నటిస్తున్నారు. కోడి రామ‌కృష్ణ‌ సమర్పణలో కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. భాస్కర భట్ల లిరిక్స్ అందిస్తున్నారు. ఎడిట‌ర్‌..గా  ప్ర‌వీన్ పూడి, ఆర్ట్ డైర‌క్ట‌ర్‌.. ఉపేంద్ర రెడ్డి
    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా .. భ‌ర‌త్ రొంగలి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పిఆర్ ఓ.. ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్‌ పనిచేస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫి.. రాజ్ నల్లి
    సంగీతం.. మ‌ణిశ‌ర్మ‌ అందిస్తున్నారు. కో-ప్రోడ్యూస‌ర్‌.. న‌రేష్ రెడ్ది మూలే
    ప్రోడ్యూస‌ర్‌.. కోడి దివ్య దీప్తి డైర‌క్ట‌ర్‌.. శ్రీధర్ గాదె (SR కళ్యాణమండపం ఫేమ్) వ్యవహరిస్తున్నారు. మరి  ఈ సినిమా విడుదలై ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Kiran abbavaram, Tollywood

    తదుపరి వార్తలు