Kiran Abbavaram - Meter: స్వయంకృషితో తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కకుంటోన్న హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పటికే మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా విడుదలైన వినరో భాగ్యము విష్ణుకథ సినిమా అతని కెరీర్‌లోనే మరో హిట్ చిత్రంగా నిలిచింది. ఈ విజయంతో కిరణ్ కమర్షియల్ హీరోగా టాలీవుడ్ లో తనదైన శైలిలో ప్రూవ్ చేసుకున్నాడు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన కిరణ్ నటించిన వినరో భాగ్యము విష్ణు కథ మంచి విజయాన్నే అందుకుంది. దీంతో కొత్త హీరోపై నమ్మకంతో ముందడుగు వేసిన నిర్మాతలు ఫైనల్ బిజినెస్ నంబర్స్ తో చాలా సంతోషంగా ఉన్నారు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా.. పట్టించుకోకుండా కెరీర్ పై కాన్‌సెంట్రేట్ చేయడం వల్లే కిరణ్ కు ఈ విజయం సాధ్యమైంది.
‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ రూ. 4 కోట్ల థియేట్రికల్ టార్గెట్‌తో రిలీజ్ అయిన ఈ మూవీ ఆ టార్గెట్ ను ఈజీగానే ఛేదించింది. ఓటిటి రైట్స్ నూ. 8 కోట్లకు, హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 5 కోట్లకు అమ్ముడు కావడం కిరణ్ ఎంచుకుంటోన్న కథల కెపాసిటీని తెలియజేస్తోంది. అలాగే ప్రతి సినిమాతోనూ తనను తాను మెరుగు పరుచుకోవడం వల్లే ఇంత పెద్ద సక్సెస్ సాధ్యం అయిందనుకోవచ్చు. కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఆయన లుక్ కొత్తగా వుంటుందన్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా హిల్లేరియస్‌తో పాటు మెసేజ్ ఓరియంటెడ్‌గా టెంపర్ మూవీ లెవల్లో ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా 127 నిమిషాలు ఉంది. అంటే 2 గంటల 7 నిమిషాలతో తక్కువ నిడివితో వస్తోంది.
అతుల్య రవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, డీఓపీ: వెంకట్.సి.దిలీప్‌అండ్‌సురేష్‌సారంగం, ప్రొడక్షన్‌డిజైనర్: జేవీ, సంభాషణలు: రమేష్‌కాదూరి, సూర్య, లైన్‌ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్‌నిర్మాత: బాబా సాయి, చీఫ్‌ఎగ్జిక్యూటివ్‌నిర్మాత : బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్‌కంట్రోలర్: సురేష్ కందులు, మార్కెటింగ్: ఫస్ట్‌ఫో, పబ్లిసిటి:మ్యాక్స్‌మీడియా, పీఆర్‌ఓ : వంశీ శేఖర్, మడూరి మధు, సమర్పణ: నవీన్‌ఎర్నేనీ, రవి శంకర్‌యలమంచిలి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రమేష్‌కాదూరి.
ఇక వినరో భాగ్యము విష్ణుకథ ఇచ్చిన కిక్ తో రాబోయే ‘మీటర్’సినిమా పై అంచనాలు పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘మీటర్’ మూవీ వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రూ. 10కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే మంచి బిజెనెస్ చేసుకుని మైత్రీ మూవీస్‌కు ఆల్రెడీ ప్రాఫిట్ వెంచర్ అనిపించుకుంది. మీటర్ కూడా పెద్ద విజయం సాధిస్తే.. కిరణ్ అబ్బవరం రూ. 20 కోట్ల మార్కెట్ హీరోగా మారతాడు. ఇంకాస్త ట్రై చేస్తే టైర్ టూ హీరోల రేంజ్‌లోకి ఈజీగానే ఎంటర్ అవుతాడు అని చెప్పొచ్చు. మొత్తంగా కిరణ్ అబ్బవరం కమర్షియల్ హీరోగా నిలబడేందుకు వినరోభాగ్యము విష్ణు కథ విజయం చాలా దోహదం చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kiran abbavaram, Meter Movie, Tollywood