చెన్నైలో సినీనటుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్

చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్‌ను గత రాత్రి కోడంబాకం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

news18-telugu
Updated: July 28, 2020, 10:31 AM IST
చెన్నైలో సినీనటుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్
నటుడు శ్యామ్(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలుగులో కిక్, ఊసరవెల్లి, రేసుగుర్రం, కత్తి, ఆక్సిజన్ సినిమాల్లో నటించిన నటుడు శ్యామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలో ఫోకర్ క్లబ్ నిర్వహిస్తున్న శ్యామ్‌ను గత రాత్రి కోడంబాకం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్లబ్ ముసుగులో శ్యామ్ గ్యాంబ్లింగ్‌ వ్యవహారాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా ఫోకర్ క్లబ్‌లో పేకాట, బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై పలు ఫిర్యాదులు రావడంతో.. పక్కా సమాచారంతో కోడంబాకం పోలీసులు ఫోకర్ క్లబ్‌పై దాడి చేసి శ్యామ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించిన శ్యామ్‌కు ప్రస్తుతం టాలీవుడ్‌ సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేవు.
Published by: Kishore Akkaladevi
First published: July 28, 2020, 10:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading