హోమ్ /వార్తలు /సినిమా /

Vikranth Rona: ఓటీటీ వేదికపైకి సూపర్ హిట్ మూవీ విక్రాంత్ రోణ.. ఇదిగో డీటెయిల్స్

Vikranth Rona: ఓటీటీ వేదికపైకి సూపర్ హిట్ మూవీ విక్రాంత్ రోణ.. ఇదిగో డీటెయిల్స్

Vikranth Rona Photo Twitter

Vikranth Rona Photo Twitter

Vikranth Rona On OTT: వెండితెరపై సక్సెస్ అయిన సినిమాలు OTT వేదికపై ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు ఆడియన్స్. ఈ క్రమంలోనే విక్రాంత్ రోణ ఓటీటీ రిలీజ్ పై జనాల్లో క్యూరియాసిటీ నెలకొంది. అయితే తాజాగా అందుకు సంబంధించిన అప్ డేట్ తెలిసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) హీరోగా నటించిన విక్రాంత్ రోణ (Vikranth Rona) సినిమాను అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. జూలై 28న విడుదలైన ఈ సినిమా అన్ని ఏరియాల్లో కూడా చెప్పుకోదగిన వసూళ్లు రాబట్టింది. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ డిమాండ్ ఏర్పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా 1.25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. అయితే సినిమా విడుదల తర్వాత ఆ మార్క్ అలవోకగా దాటేశాడు విక్రాంత్ రోణ. అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఓ అప్ డేట్ బయటకొచ్చి సినీ వర్గాల్లో కుతూహలం పెంచింది.


వెండితెరపై సక్సెస్ అయిన సినిమాలు OTT వేదికపై ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు ఆడియన్స్. ఈ క్రమంలోనే విక్రాంత్ రోణ ఓటీటీ రిలీజ్ పై జనాల్లో క్యూరియాసిటీ నెలకొంది. అయితే తాజాగా అందుకు సంబంధించిన అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా హక్కులను తీసుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ వచ్చే వారంలో ఈ సినిమాను OTT వేదికపై స్ట్రీమింగ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట.


తెలుగుతో పాటు మొత్తం ఐదు భాషల్లో రూపొందిన ఈ సినిమాకు అన్ని చోట్ల భారీ స్థాయిలో స్పందన లభించింది. కిచ్చా క్రియేషన్స్, శాలినీ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటించింది. నిరూప్ భండారి, నీతా అశోక్ కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా విజయ్ పట్ల చిత్ర యూనిట్ ఎంతో ఆనందం వ్యక్తం చేసింది.


విడుదలకు ముందు ఈ సినిమాపై ఉన్న అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట విక్రాంత్ రోణ. అయితే విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా సగం కంటే ఎక్కువ టార్గెట్ పూర్తి చివరకు అలవోకగా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. ఈ సినిమా విజయంతో ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలను థియేటర్లలో చూసేందుకు సిద్ధంగా ఉన్నారని మరోసారి స్పష్టమైంది. సో.. చూడాలి మరి థియేటర్స్‌లో కాసుల వర్షం కురిపించిన విక్రాంత్ రోణ ఇక ఓటీటీ వేదికపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడనేది!.

First published:

Tags: Kiccha sudeep, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు